తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఎన్నికలనేవి చాలా కీలకంగా మారాయి.రాజకీయంగా సీఎం కేసీఆర్ కి ఎంత బలంగా ఉన్నా సరే నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఆయన కనుక విజయం సాధించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొన్ని కొన్ని కీలక పరిణామాలు ఈ మధ్య కాలంలో కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. నాగార్జున సాగర్ కు సంబంధించి జానారెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు.ఆయన ఆ నియోజకవర్గంలో ముందు నుంచి కూడా ఆదిపత్యం కొనసాగిస్తునే ఉన్నారు.

దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఆయన ఇక్కడ బలమైన నేతగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ రెండు సార్లు మాత్రమే జానారెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయనను ఎదుర్కోవడం అనేది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. జానారెడ్డి విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చాలా వరకు కూడా పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ జానారెడ్డి ఓడిపోతే మాత్రం ఆయనకు రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేక పోవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను జానారెడ్డి సీరియస్ గా తీసుకుని నాగార్జునసాగర్లో గట్టిగానే కష్టపడుతున్నారు.తన కుమారులు కూడా నాగార్జునసాగర్ లోసీరియస్ గా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ గట్టిగా దృష్టి సారించి మంత్రులందరినీ కూడా పంపించారు. పరిపాలనా వ్యవహారాలు కూడా పక్కన పెట్టీనాగార్జునసాగర్ ఎన్నికల్లో విజయం సాధించాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు దృష్టి సారించిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

 నాగార్జునసాగర్ పరిధిలో వామపక్షాలు కూడా బలంగానే ఉన్నా సంగతి తెలిసిందే. అయితే పక్షాలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే సీఎం కేసీఆర్ ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇది మరో దెబ్బ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: