దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పీక్స్ కి చేరనుందని అంచనా వేశారు సైంటిస్టులు. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకో వారం పాటు ఇదే స్థాయిలో మరణాల రేటు ఉండబోతుందని అంచనా వేస్తున్నారు వైద్య శాస్త్ర నిపుణులు. ఇదిలా ఉండగా పలు రాష్ట్రాలలో ఇప్పటికే కరోనా పీక్ దశకు చేరి నెమ్మదిగా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ ఉంది. మరికొన్ని రాష్ట్రాలలో కరోనా ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పంజాబ్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో రానున్న వారం రోజుల్లో కరోనా తమ ప్రభావాన్ని మరింత ప్రభావవంతంగా చూపించనుందని తేల్చి చెప్పారు.

ఆయా రాష్ట్రాలలో  కరోనా ఉదృతిని పరిగణలోకి తీసుకొని ఈ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, చతిస్గడ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో ప్రస్తుతానికి కరోనా విజృంభణ కాస్త తగ్గిందని కరోనా పీక్ దశ ముగిసినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే విధంగా ఈ నెల 31 నాటికి దేశంలో కరోనా కేసుల్లో తిరోగమనం కనిపిస్తుందని కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీందర్ అగర్వాల్ వెల్లడించారు. మే చివరి నాటికి రోజువారీ కరోనా కేసులు నమోదు సంఖ్య 1.5 లక్షల చేరనుందని జూన్ కి అంతా  నమోదు కేసుల సంఖ్య 20 వేలకు పడిపోతుందని పేర్కొన్నారు.

అయితే రానున్న ఆరు నుండి ఎనిమిది నెలల్లో కరోనా థర్డ్ వేవ్ దేశంపై తన పంజా విసిరే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు ప్రముఖ శాస్త్రవేత్తలు. కాబట్టి గతంలో లాగ ఎటువంటి పరిస్థితుల్లో కావర్ణ ను తక్కువ అంచనా వేయొద్దని నిపుణులు ప్రజలకు మరియు ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు. రానున్న థర్డ్ వేవ్ అత్యంత భయంకరంగా ఉండే ప్రమాదం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: