ఈ క్రమంలోనే కరోనా పేరెత్తితే చాలు దీర్ఘకాలిక వ్యాధులు అయిన షుగర్, బీపీ లాంటి వాటితో బాధపడుతున్నవారు చిగురుటాకులా వణికిపోతున్నారు. అయితే ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కొన్ని ప్రత్యేకమైన చర్యలు, ముందు జాగ్రత్తలతో వైరస్ బారి నుంచి బయట పడవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఇలా షుగర్, బీపీ తో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరు ఆసుపత్రిలో చేరాల్సిన పని లేదు అని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇక రోజువారి పర్యవేక్షణ అమలు చేయడం ఎంతో ముఖ్యం అని చెబుతున్నారు ముఖ్యంగా ప్రోటీన్లతో కూడిన ఆహారంకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు.
బీపీ, షుగర్ లాంటి రెండు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలోనే వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని.. అందుకే దగ్గు, జలుబు లాంటి చిన్నచిన్న లక్షణాలు కనిపించినా ఇలాంటివారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెబుతున్నారు. ఇక వైద్యులను సంప్రదించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది అన్న పూర్తిస్థాయిలో తెలుసుకోవడం మేలు అని చెబుతున్నారు. ఇక మాంసకృత్తులు ఎక్కువగా ఉండే మటన్,చికెన్, పప్పు ధాన్యాలు లాంటివి ఎక్కువ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి