నేటి రోజుల్లో టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నారు ప్రతి ఒక్కరు.  ఈ క్రమంలోనే మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా సందేశం పంపాలి అంటే ఉత్తరం రాసి అది పోస్ట్ ఆఫీస్ లో వేసి రెండు మూడు రోజుల వరకు వేచి చూడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవసరంలేదు. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు మనం చెప్పాలనుకున్న సమాచారం అరక్షణంలో ఎదుటి వ్యక్తి కళ్ళముందు వాలిపోతుంది.  ఇలా ప్రస్తుతం ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీంతో ఎక్కువమంది ఇక ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లలో గంటల తరబడి కాలం గడుపుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.




 ఇక ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ మెసేజ్ యాప్స్ ఉన్నప్పటికీ ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏది అంటే వాట్సాప్ అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారితో వాట్సాప్ లోనే మెసేజ్ చేస్తూ గంటల తరబడి వాట్సాప్ చాట్ లోనే కాలం గడుపుతున్నారు. ఇక ఏదైనా సమాచారాన్ని అందరికీ చేరవేయడానికి కూడా వాట్సాప్ ఒక వేదిక గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  వాట్సాప్ ద్వారా ప్రస్తుతం అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తే మాత్రం వాట్సప్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు అని అటు నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు.  కొన్ని రకాల పనులు మాత్రం వాట్సాప్ లో అస్సలు చేయొద్దు అని చెబుతున్నారు నిపుణులు.



 అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  ముఖ్యంగా వాట్సాప్ లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు జోలికి అస్సలు వెళ్లొద్దు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను వీడియోలను షేర్ చేయడం చేస్తే ఇక ఇబ్బందులు తప్పవు. అంతే కాకుండా మహిళలు ఇబ్బంది పెట్టే విధంగా మెసేజ్లు చేయడం లాంటివి కూడా అస్సలు చేయద్దు. అంతేకాదు మరొకటి పేరుతో వాట్సాప్ ఖాతా ఓపెన్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఇక మతానికి ప్రాంతానికి వ్యతిరేకంగా మెసేజ్ పెట్టిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు పోలీసు అధికారులు. నకిలీ వార్తలను షేర్ చేయడం.. నిషేధిత వస్తువులను అమ్మకాలు జరపడం లాంటివి కూడా వాట్సాప్ లో నిషేధం  అంతేకాకుండా అసభ్యకరమైన క్లిప్లను షేర్ చేయడం.. హిడెన్ కెమెరా వీడియోలను షేర్ చేయడం కూడా వాట్సాప్ లో నిషేధం. ఇలాంటివి చేశారు అంటే చిక్కుల్లోపడక తప్పదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాట్సప్ప్ వాడుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: