తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగినప్పటికి.. ప్రస్తుతం కేసులు మాత్రం అదుపులోకి వచ్చాయి. అయితే దీనిని ఉద్దేశం లో పెట్టుకుని..  తెలంగాణ‌ రాష్ట్రం లో సెప్టెంబర్ 1 వ తారీఖు నుంచి పాఠశాలలలో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే 8 వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన చేస్తోంది తెలంగాణ  సర్కార్.  

ఈ నేపథ్యం లోనే ఈ రోజు  సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  స్టేటస్ రిపోర్ట్ నీ ఇప్పటికే తెలంగాణ సీఎం కెసిఆర్ కు  విద్యాశాఖ పంపింది.  తెలంగాణ రాష్ట్రం లో కరోనా ప్రస్తుతం అదుపు లోనే ఉందని... విద్యార్థులకు ఎలాంటి  ప్రమాదం లేదని సీఎం కెసిఆర్ కు ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొంది విద్యా శాఖ.  పలు రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభం పై వచ్చిన ఫలితాలను కూడా సీఎం కేసీఆర్  దృష్టికి తెలంగాణ  విద్యాశాఖ తీసుకెళ్లింది.   

తల్లి దండ్రులు ఆందోళన చెందా ల్సిన పని లేదని విద్యా శాఖ స్పష్టం చేస్తోంది.  స్కూళ్లు తెర వమని ఇప్పటికే సూచించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ  విద్యా శాఖ గుర్తు చేసింది.  ఈ విషయం పై   రేపు లేదా సోమ వారం విద్యాశాఖ ఉన్నతాధి కారుల సమావేశం కూడా ఉండనుంది. ఈ ప్రక్రియ అనంతరం సీఎం కెసిఆర్.. పాఠశాలలలో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ఆదేశాలు జారీ చే సే అవకశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 453 కరోనా కేసులు నమోదవగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8137 యాక్టివ్ కేసులు
 ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: