ధనం, టెక్నాలజీ, సైన్యం.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుంది అమెరికా.. అలాంటి అమెరికా ఇప్పుడు ఓ చిన్న దేశంలో తీరని అవమానం ఎదుర్కొంది. తనపై జరిగిన ఉగ్రదాడికి కారణమైన వారిని మట్టుబెట్టాలన్న లక్ష్యంతో అఫ్గానిస్తాన్‌లో అడుగు పెట్టిన అమెరికా.. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత కూడా చాలా ఏళ్లపాటు అఫ్గానిస్తాన్‌లో పాగా వేసింది. అక్కడ ప్రభుత్వానికి రాయితీలు, ప్రోత్సహాకాలు అందించి తన కనుసన్నల్లో ఉంచుకుంది.
కానీ.. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అమెరికా కూడా తన పాత ప్రవర్తనపై పునరాలోచనలో పడింది. కారణాలు ఏమైనా.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించింది. అయితే అసలే తప్పుల తడకగా నిర్ణయాలు తీసుకున్న అమెరికా చివరకు సైన్యం నిష్క్రమణ విషయంలోనూ తప్పులే చేసింది. దీని కారణంగా ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటోంది. అఫ్గానిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తీరు అమెరికాకే అవమానకరంగా ఉందని ట్రంప్ వంటి నేతలు మండిపడుతున్నారు.
ఇంత చెత్తగా ఎప్పుడూ అమెరికా ఉపసంహరణ ఎన్నడూ జరగలేదని ట్రంప్ బైడెన్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యం వదలివేసిన పరికరాలను వెనక్కి తీసుకు రావాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాలిబన్ల నుంచి వాటిని తెప్పించాలని, లేదా వాటిని నాశనం చేయాలని ట్రంప్ సూచించారు. అవసరమైతే అమరికా బలగాలను పంపించాలని కూడా ట్రంప్ అంటున్నారు. ఇంతగా బలహీనమైన, మూర్ఖపు ఉపసంహరణ ఎన్నడూ చూడలేదని ట్రంప్ మండిపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి