భారీ ఎత్తున ప్రచారం లేకపోయినా, ఆర్భాటం లేకపోయినా పోటాపోటీ పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికలో మమతను ఓడించి.. ఆమెకు చెక్ పెట్టడమే తమ లక్ష్యమని భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో మమతను ఓడించినట్టే, ఈ బై పోల్ లోనూ ఓడించి సత్తా చూపుతామంటూ గత ఎన్నికల్లో ఆమె మీద గెలిచిన సువేందు అధికారి ప్రకటించారు. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న మమతను మరోసారి ఎమ్మెల్యేగా ఓడించి.. ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తామన్నట్టుగా కమలం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నప్పటికీ, వాళ్ల టార్గెట్ గట్టిగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంత తేలికగా కనిపించడంలేదు.
భవానీపూర్ నియోజకవర్గం టీఎంసీకి కంచుకోట. గతంలో మమత ఇదే సీటు నుంచి రెండు సార్లు గెలిచారు. అలాంటి చోట ఆమెను ఓడించడం దాదాపు అసంభవమని చెప్పవచ్చు. ఫలితాల సరళి కూడా ఈ విషయాన్నే చెబుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికే మమత మెజారిటీతో దూసుకుపోతున్నట్లు సమాచారం అందుతోంది. మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి మమతా బెనర్జీ 2500 ఓట్లకు పైగా మెజారిటీని సాధించి ఆధిక్యంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తొలి రౌండ్ లో కేవలం 800 ఓట్లు సాధించగలిగారు.
భవానీ పూర్ లో టీఎంసీకి ఉన్న ఊపు, తొలి రౌండ్ల కౌంటింగ్ సరళిని గమనిస్తే.. మమతాబెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమేననిపిస్తోంది. మరోసారి మమతను ఓడించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుకోవడానికే ఆమె మొహమాటపడే పరిస్థితి తీసుకురావాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీ లక్ష్యం నెరవేరుతున్నట్టుగా కనిపించడంలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి