బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార ప‌ర్వం ప్రారంభ మ‌వుతోన్న వేళ టీడీపీ డిఫెన్స్ లో ప‌డింది. అస‌లు పోటీ చేయాలా ?  వద్దా ? అన్న దాని పై టీడీపీలో తర్జనభర్జన జ‌రుగుతుంది. ఎందు కంటే వైసీపీ అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధా కి టికెట్ ఇవ్వటంతో కొంతమంది టిడిపి నేతలు బ‌ద్వేల్ లో పోటీ చేసే అంశంపై పునరాలోచనలో  ప‌డిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎందు కంటే టీడీపీ తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌లో తీసుకున్న స్టాండ్ ను కూడా ఇప్పుడు కొంద‌రు తెర మీద‌కు తెస్తున్నారు.

తిరుపతి లోక్ స‌భ ఉప ఎన్నికల్లో అక్కడ మరణించిన అభ్యర్థి కుటుంబానికి టికెట్ ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగామని చెప్పిన టీడీపీ , ఇప్పుడు బ‌ద్వేల్లో ఏం ఆన్స‌ర్ ఇస్తుంద‌ని.. ఇక్క‌డ పోటీ పెట్టి ఎలా స‌మ‌ర్థించు కుంటుంద‌ని వైసీపీ వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పటికే బద్వేలు ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన జనసేనాని.. సుధ‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఇక జనసేన నిర్ణయంతో ఇరుకున పడిన బిజెపి త‌మ పార్టీ అభ్య‌ర్థిని పోటీ పెట్టాలా ? వ‌ద్దా ? అని ఆలోచ‌న చేస్తోంది. ఇప్ప‌టికే కడపలో బిజెపి అగ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే వైసీపీ వైపు నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలించాలని త‌మ పార్టీ త‌ర‌పున పోటీ పెట్ట‌కుండా విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కొంతమంది టీడీపీ నేతలు సూచిస్తున్నారు.

ఇప్పటికే ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక స్థానిక పార్టీ కేడ‌ర్ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీ చేయాల‌ని అంటున్నారు. ఏదేమైనా జ‌న‌సేన నిర్ణ‌యంతో డిఫెన్స్ లో ప‌డ్డ చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి. ఏదేమైనా ప‌వ‌న్ నిర్ణ‌యం తో అటు బీజేపీ.. ఇటు టీడీపీ రెండిటి ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి చందంగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: