ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులఫై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఎంతటి వారైనా సరే ఎప్పుడైనా రోడ్డు నిబంధనలు పాటించకపోతే ఇక వారికి భారీగా జరిమానాలు విధించడం లాంటివి కూడా చేస్తున్నారు. మరికొన్నిసార్లు ఏకంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు కూడా పంపిస్తున్నారు. నేటి రోజుల్లో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాగి వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులను గుర్తించి జైళ్లకు పంపిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవలి కాలంలో అటు పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరి విషయంలో ఎంతో కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కేవలం సామాన్యుల విషయంలోనే కాదు పలువురు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన కూడా వదిలిపెట్టడం లేదు పోలీసులు. దీంతో ఎంతో మంది తాగి వాహనం నడవాలంటేనే వణికిపోతున్నారు. ఎక్కడ పోలీసులకు దొరికితే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని  భయపడుతున్నారు. అయితే ఇక్కడ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడాన్ని తప్పు అని చెప్పాల్సిన ఒక ఎమ్మెల్యే మాత్రం దారుణంగా వ్యవహరించి విమర్శల పాలవుతున్నారు.



 రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లో ధర్నాకు దిగారు. ఇటీవలె ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా అందులో ఎమ్మెల్యే మీనా కన్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. ఇక మద్యం తాగినట్లు నిరూపణ కావడంతో అతని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఒక ఎమ్మెల్యే తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు  చేరుకున్నారు. తన మేనల్లుడిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే. పిల్లలందరూ కొన్ని సమయాల్లో తాగుతారు అందులో తప్పేముంది అంటూ ఏకంగా పోలీసుల మీదికి రివర్స్ అయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: