వేల కోట్ల అధిపతితో పోరాడుతున్న తనకు ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఈ వందరోజుల ప్రచారం సందర్భంగా అర్థమైందని.. చాలా స్పష్టమైన మెజారిటీతో తాను ఈ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై గెలవబోతున్నానని ప్రజలు ఇవ్వబోయే విజయానికి హుజురాబాద్ ప్రాంతానికి తక్షణమే మెడికల్ కళాశాల మంజూరు చేయాలని ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వారం రోజుల క్రితం ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు  సమాచారం.  అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై హుజురాబాద్ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాల, నియోజకవర్గానికి 5000 డబుల్ బెడ్రూం గృహాలు మంజూరు, ఫుడ్  ప్రాసెసింగ్ పరిశ్రమలు, ప్రభుత్వ ఐటిఐ వంటి అభివృద్ధి పనులు మంజూరు చేయాలని హుజురాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వంద కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని తన లేఖలో ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.

 హుజురాబాద్ అంటే తనకు ప్రేమని, ఆ విషయం రాజేందర్ కు తెలుసని, మీరు కోరినట్లుగా ప్రతి విషయాన్ని హరీష్ రావు తో సంప్రదించి హుజురాబాద్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని తనను కలిసిన గెల్లుతో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వంద పడకల ఆసుపత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయించినట్లయితే నిరుపేద గ్రామీణులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని.. హైదరాబాద్, వరంగల్ తప్ప ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం లభించడం కష్టమవుతుందని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించి తన విజయానికి బహుమానంగా హుజురాబాద్ కు మెడికల్ కళాశాల మంజూరు చేయించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గెల్లు కోరినట్లు సమాచారం. రాజేందర్ ఓటమి చెందుతారని గట్టిగా ఎలా చెబుతున్నావని కేసీఆర్ గెల్లును సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 95 శాతం టీఆర్ఎస్ క్యాడర్ మంత్రి హరీష్, నేతృత్వంలో తిరిగి పార్టీలో చేరడం ద్వారా మాజీ మంత్రికి మొదటి దెబ్బ తగిలిందని.. ఆ తర్వాత పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి లాంటి వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం రెండో తప్పిదమయితే.. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ సహకారాన్ని కోరడం క్షమించరాని విషయం అంటూ కమలదళం కన్నెర్రజేసిన విషయాన్ని ఆయన సీఎంకు వివరించినట్లు తెల్సింది. బీజేపీలో ఆయన  చేరిక తర్వాత ప్రచారం చేసే క్యాడర్ ఆయనకు లభించక పోవడం వంటి కారణాలు టిఆర్ఎస్ విజయానికి దోహదపడినట్లు గెల్లు తన లేఖలో వివరించారు. ఆరు పర్యాయాలు తాను ఎమ్మెల్యేగా గెలుపొందారని,ఆ క్రెడిట్ అంతా తనదేనని జబ్బలు చరుచుకునే రాజేందర్ అసలు విషయం మరిచిపోతున్నాడని ఆయన టిఆర్ఎస్ లో చేరకముందే మాజీ మంత్రి దామోదర్ రెడ్డి బలంగా ఉన్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిని టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన నగ్నసత్యం ఈటెల  తెలుసుకుంటే మంచిదని గెల్లు ప్రస్తావించినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: