ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆ పార్టీ నేత‌ల‌ను గ‌త యేడాది న్న‌ర కాలంగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఎలాగూ ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌రు.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయ‌ వ్యూహమేంటి ? ఆయన వైసీపీకి ఎప్పుడు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరతారా? అన్న చర్చ జరుగుతోంది. రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్నారు. ఆయ‌న న‌ర‌సాపురం వెళ్లి దాదాపు యేడాదిన్న‌ర టైం అవుతోంది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ఎలాగైనా ఎంపీ గా పోటీ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే ఈ సారి తెలుగుదేశం పార్టీ రఘురామ కృష్ణరాజు ను తమ పార్టీలో చేరి... వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీ గా పోటీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ ఈ సమయంలో టీడీపీలో చేరితే అది ఖ‌చ్చితంగా పార్టీకి హైప్ పెరుగుతుంది. అందుకే చంద్ర‌బాబు సైతం ఇప్ప‌టికే ర‌ఘు రామ‌తో ట‌చ్‌లోకి వెళ్లి.. త‌మ పార్టీలో చేరితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీ సీటు మీకే ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు టాక్ ?

పశ్చిమ గోదావరి జిల్లా తో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రాజుల సామాజిక వ‌ర్గంలో వైసీపీని దెబ్బతీయాలన్న వ్యూహంలో రఘురామ కృష్ణరాజును ముందుగానే పార్టీలో చేర్చుకోవాలని చంద్ర‌బాబు ప్లాన్ గా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ర‌ఘురామ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన కూడా ఆఫర్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేత‌లు చెపుతున్నారు. జ‌న‌సేన లో చేరితే చాలు... వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిందట.

మ‌రో వైపు బీజేపీతో ఆయ‌న‌కు పాత ప‌రిచ‌యాలు ఉన్నాయి.. వాళ్లు కూడా పార్టీలో చేర‌మ‌ని కోరుతున్నార‌ట‌. మ‌రి ర‌ఘురామ ఏ పార్టీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: