ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రఖ్యాతి గాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇక కాలంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా కొన్నాళ్ళపాటు ఇక్కడ శ్రీవారి దర్శనం పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది టిటిడి బోర్డు. ఇక ఆ తర్వాత ఇక దర్శన టికెట్లను అంతకంతకూ పెంచుతూ వస్తోంది.


 అయితే ఇటీవలి  చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు ముంచెత్తాయి అన్న విషయం తెలిసిందే. దీంతో తిరుపతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయాన్ని మొత్తం భారీగా వరద నీరు చుట్టుముట్టాయ్. దీంతో భక్తులు ఆలయానికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వరదల నేపథ్యంలో ఎంతో మంది భక్తులు అటు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ స్వామివారి  దర్శనానికి వెళ్లకుండా వెనకడుగు వేశారు అని చెప్పాలి. అయితే కొన్ని రోజులపాటు స్వామివారి దర్శనం నిలిచిపోగా ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.



 తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉన్న శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడుతుంది అన్నది తెలుస్తుంది. ఇటీవల టిటిడి బోర్డు ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేశారు. అయితే టికెట్లు విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తయిపోవటం గమనార్హం. ఏకంగా 20 నిమిషాల్లో మూడు లక్షల పదివేలు టోకెన్లను బుక్ చేసుకున్నారు భక్తులు. ఇక నిమిషాల వ్యవధిలోనే టీటీడీ విడుదల చేసిన టిక్కెట్లు కూడా పూర్తవడంతో సమాచారం తెలియక ఎంతోమంది ఇప్పటికీ టికెట్ల కోసం వెబ్సైట్లో లాగిన్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే టీటీడీ దర్శనం కోటాను పెంచకకోవడంతో
భక్తులు మాత్రం తీవ్ర నిరాశకు గురవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd