ఒమిక్రాన్‌.. ఒమిక్రాన్.. ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచం మొత్తం గడగడలాడుతున్న పేరు ఇది.. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వేరియంట్ ఇది. దీని కారణంగా మరోసారి ప్రపంచంలో కరోనా వేవ్ తప్పదేమో అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అనుకున్నట్టే ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో చాలా డేంజరస్‌ గా భావించిన డెల్టా వేరియంట్‌ కంటే ఇది ఐదు రెట్లు వేగంగా వ్యాపించే లక్షణాలు ఈ ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది.


ఈ వేరియంట్ వెలుగు చూసిన వారం రోజుల్లోనే దాదాపు 30 దేశాల్లోకి పాకిపోయింది. దాదాపు 300 కు పైగా ఈ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్‌కు కూడా టీకాను రూపొందించే పని పడ్డాయి ఫార్మా సంస్థలు. తాము తాజాగా తయారు చేసిన సోట్రోవిమాబ్ అనే టీకా ఈ ఒమిక్రాన్ పై కూడా బ్రహ్మాండంగా పని చేస్తోందని బ్రిటన్ దేశం ప్రకటించింది. తీవ్రమైన కరోనా లక్షణాల ముప్పు ఉన్నవారి కోసం రూపొందించిన ఈ సోట్రోవిమాబ్ ఒమిక్రాన్ సహా కొత్త వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తుందట.


ఈ విషయాన్ని టీకా తయారీ సంస్థలు చెబుతున్నాయి. తేలికపాటి నుంచి పరిమిత లక్షణాలు కలిగినవారిని ఈ టీకా కాపాడుతుందట. అలాగే తీవ్రమైన వ్యాధి రాకుండా ఈ టీకా అడ్డుకుంటుందట. ఈ టీకా వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని బ్రిటన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ చెబుతోంది. ఈ ఈ సోట్రోవిమాబ్ ను మోనోక్లోనల్ సింగిల్ డోసు టీకాగా తయారు చేశారు. జీఎస్‌కే, వీర్ బయోటెక్నాలజీ సంస్థలు ఈ సోట్రోవిమాబ్‌ ను డెవలప్ చేశాయి.


ఈ టీకా వైరస్ లక్షణాలతో అధిక ముప్పు ఉన్నవారిలో మరణాలను 79శాతం తగ్గిస్తుందట. ప్రయోగ పరీక్షల డేటా ఆధారంగా కరోనా ప్రాథమికదశలో ఉన్నప్పుడు ఈ సోట్రోవిమాబ్ టీకా అత్యంత సమర్థంగా పనిచేస్తుందట. వైరస్ సోకిన 5రోజుల్లోగా ఈ టీకా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: