ఒకప్పుడు కూటమితో(యూరోపియన్ యూనియన్) ఉన్న బ్రిటన్ అనంతరం బయటకు వచ్చింది. అప్పట్లో ప్రజల కోరిన మేరకు ఆ దేశం యూరోపియన్ యూనియన్ నుండి ఒక్క శాతం ఓటు తో బయటకు వచ్చేసింది. అదే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెడుతుంది. చిన్నతనంలో కలిసి ఉంటె ఉండే బలం గురించి కధ ఒకటి చెప్పేవారు పెద్దలు, అది బ్రిటన్ విషయంలో నిజం అనిపిస్తుంది. ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఏదైనా చెల్లింది. కానీ ఇప్పుడు అన్నిటికి అందరి దగ్గరకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. అది అదునుగా చేసుకొని కొన్ని దేశాలు బాగా ఆడేసుకుంటున్నాయి. ప్రపంచం అన్నాక ఒకరికి ఒకరు ఏదో ఒక సమయంలో సాయం  చేసుకోవడం సహజం. పక్కవారి సాయం లేకుండా ప్రస్తుత సమాజంలో బ్రతకడం కూడా అంత సులభం ఏమి కాదు. అదంతా కూటమి నుండి బయటకు వచ్చేప్పుడు బ్రిటన్ కు అర్ధం కాలేదు, ఇప్పుడిప్పుడే అవన్నీ అర్ధం అవుతున్నాయి.

ఒక్క కరోనా సమయంలోనే ఉద్యోగస్తుల కొరతతో కొత్త సంక్షోభం వచ్చింది, అలాగే కనీసం ఇంధనం లేని స్థితిని కూడా స్వయంగా చవిచూసింది బ్రిటన్. ఒకప్పుడు యూనియన్ లో భాగస్వామిగా ఉన్నప్పుడు సాయం అడిగితే అందరు ముందుకు వచ్చేవారు, కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నది కాబట్టి ఎవరిని అడగాలన్నా కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, అదే సమస్యగా పరిణమిస్తుంది. విడిగా అడుగుతుండటంతో అమెరికా లాంటి వాళ్ళు కూడా బ్రిటన్ కు సాయం చేయడానికి యూనియన్ ను అడిగి చేస్తాం అంటూ కొత్త సాకులు చెప్పుకుంటూ వస్తుంది.

ఇందులో కూడా తప్పు లేకపోవచ్చు, ఒకప్పుడు అంటే యూనియన్ లో ఉన్నది కాబట్టి ఒక్కరూపాయి అటోఇటో అంటూ కొన్ని సుంకాలు తగ్గించుకుంటూ ఆయా దిగుమతులు, ఎగుమతులు, వాణిజ్య ఒప్పందాలు ఉండేవి. ఇప్పుడు యూనియన్ నుండి వెళ్ళిపోయాక కూడా ఆ సౌకర్యాలు అన్ని అడిగితే కాస్త ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంటుంది మరి. మిగిలిన దేశాలలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవడం తప్పని సరి కాబట్టి, అమెరికా కూడా తగిన విధంగా స్పందిస్తుంది. ఇప్పటికైనా బ్రిటన్ మరోసారి కూటమిలో చేరుతుందా లేక ఇతర దేశాల వైపు చూస్తుందా అనేది చూడాల్సి ఉంది. చెప్పాలంటే బ్రిటన్-అమెరికాలు స్నేహితులే కానీ వ్యాపారం దగ్గర తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటుంది అమెరికా. అందుకే బ్రిటన్ కు సరుకు సరఫరా విషయంపై ఇంతలా ఆలోచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: