ఈ రెండు ఘటనలు కూడా పారలల్‌గా ఉండడం. ఇద్దరూ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సహజంగానే ఆర్య వైశ్య సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. అయితే.. ఇది ఎన్నికలపై ప్రభావం చూపుతుంద ని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం గమనార్హం. నిజానికి వైశ్య సామాజిక వర్గం అసంతృప్తిలో ఉన్న మాట నిజమే. అటు వ్యాపారాల పరంగా.. ఇటు రాజకీయంగా కూడా వారు ఇబ్బంది పడుతున్నారనేది వినిపిస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు మంత్రిగా ఉండి కూడా తమకు ఎలాంటి లాభం లేదని అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది.
ఇలాంటి సమయంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన సొంత పార్టీ నేతలకు దాడులు చేయడం ద్వారా.. పార్టీకి నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. దీనిని కొన్ని ప్రత్యర్థి పార్టీలు తమకు అనుకూలం గా మార్చుకుని దాడిని మరింత పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పుడు.. వైశ్య సామాజిక వర్గం దూర మవుతుందా? అనేచర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జరిగిన ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా.. వైసీపీకి చెందిన వైశ్య నాయకులు ఎవరూ స్పందించలేదు.
పైగా.. ఖండించనూ లేదు.. అలాగని రచ్చ కూడా చేయలేదు. వేచి చూస్తున్నారు. అయితే.. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం వారు స్పష్టం చేస్తున్నారు. అదేంటంటే.. ఇలాంటివి కామనేనని.. వ్యతిరేక ప్రచారానికి లొంగిపోవాల్సిన అవసరం లేదని.. అంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా అనేక ఘటనలు జరిగాయని.. అలాంటి సమయంలోనే పార్టీ నిలబడిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే.. ఈ విషయం చర్చనీయాంశంగానే ఉండడం గమనార్హం. తర్వాత పరిణామాల్లో ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి