కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇలా మోడీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలు లో అటు కొత్త సాగు చట్టాలను అమలులోకి తీసుకు రావడం కూడా ఒకటి. మధ్యవర్తులు దళారులు కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోతున్నారని భావించి ఇక రైతులు దేశం లో ఎక్కడైనా సరే పండించిన పంటను ఎంతో స్వేచ్ఛగా అమ్ముకునేందుకు వీలుగా కొత్త చట్టాలను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన సాగు చట్టాలపై మొదట్లో రైతులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఉద్యమం చేపట్టారు.


 కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ తేల్చి చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇక రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేపడుతున్న రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయ్. ఇక ఇటీవలే ఉద్యమాన్ని విరమించాయి అన్న విషయం తెలిసిందే..


 అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసినట్లేనా అయినా లేక మళ్లీ ఏదైనా ట్విస్ట్ ఇస్తూ సాగు చట్టాలను అమలులోకి తీసుకు వస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయ్. స్వల్ప మార్పులతో సాగు చట్టాలను మళ్లీ అమలులోకి తీసుకు వస్తాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.. రైతుల అభ్యున్నతి  కోసం ప్రధాని మోదీ ఎంతో చేశారు అంటూ వ్యాఖ్యానించారు. మోడీ ఎవరూ చేయని పని చేసి చూపించారని చెప్పుకొచ్చారు నరేంద్ర సింగ్ తోమర్.  కాగా వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకు వస్తాము అంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కాస్త కొత్త చర్చకు దారితీశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: