కానీ దీన్ని కూడా తీసేద్దాం అని అనుకుంటున్న
ధోరణిలో జగన్ సర్కారు ఉందా అన్నది ఓ ప్రశ్న?
అందుకు అనుగుణంగానే ఆయన చర్యలు ఉండబోతున్నాయా?
ఎవ్వరినీ ఆయన ప్రశ్నించనివ్వరా? కనీసం మాట్లాడనివ్వరా?
నాయకన్ తీసి హిట్ కొట్టాడు మణిరత్నం.ఇరువర్ తీసి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు మణిరత్నం..ఈ రెండు సినిమాలు మదరాసీ ల జీవితాలను ప్రభావితం చేసిన రాజకీయ నాయకులవే కావడం విశేషం. వరదరాజన్ ముదలియార్ అనే డాన్ కథ. తమిళ నాట నుంచి ముంబయ్ కు వెళ్లి అక్కడి ప్రాంతాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన చీకటి సా మ్రాజ్య అధినేత (మాఫియా డాన్) కథ. తరు వాత ఇరువర్ కథ తెలుగులో ఇద్దరుగా రిలీజ్ అయింది.ఈ సినిమా ఎంజీఆర్(పూర్తిపేరు : మరుతూర్ గోపాలన్ రామచంద్రన్),క రుణానిధి మధ్య ఉన్న స్నేహ బంధానికి తార్కాణంగా వచ్చింది.
ఆసక్తికరంగా టైటిల్,పాటలు ఉన్నా కూడా ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత ఆర్జీవీ సర్కార్ తీశారు. ఇది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కథే! మరాఠీల ఆరా ధ్య నేతను బుర్రలో ఉంచుకుని తీసిన సెల్యులాయిడ్ వండర్. ఈ సినిమా ఎంతో పేరు తెచ్చింది బిగ్ బీ కి.ఈ సినిమా తరువాత వర్మ ఏం చెబితే అది చేస్తాను అని కమిట్ అ య్యారు అమితాబ్. అది ఓ తెలుగువాడి సత్తా ముంబయ్ వీధుల్లో! భాష కాని భాషకు చెందిన చిత్ర పరిశ్రమలో! దటీజ్ ఆర్జీవీ! ఇక తాజాగా ఆచార్య సినిమా కూడా ఓ పొలి టీషియన్ ను టార్గెట్ చేసుకుని తీసిందే అని కొందరంటున్నారు.
దేవాదాయ శాఖలో జరిగే అవినీతి,ఓ గుడి చుట్టూ జరిగే అక్రమాన్ని నిలువరించే క్రమం ఇవన్నీ తెలియజెప్పేలా కొరటాల ఈ కథ రాసుకున్నారు. ఇవేం పెద్ద వివాదాస్పద విషయాలు కాకపోయినా వైసీపీ వీటిని వివాదం చేస్తే ఏం చేయాలేం.అసలే కయ్యాల మారి పార్టీ ఏం అన్నా,ఏం చెప్పినా తప్పుగానే అనుకుటుంది కదా! అయినా కూడా ఈ సినిమా వెల్లంపల్లిని,ఆయన శాఖను టార్గెట్ చేస్తే చేయవచ్చుగాక..అలా చేయడం తప్పేం కాకపోయినా ఆ కథ నడిచే విధానాన్ని,ఆ సినిమాను రూపొందించిన పద్ధతిని ఏ విధంగా అర్థం చేసుకుంటారో అన్నదే ఇప్పుడిక చర్చకు తావిచ్చే విషయం.
ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు ముందుగానే అలర్ట్ అయిపోయిందని టాక్..సినిమా ప్రివ్యూ ఒకవేళ సీఎం జగన్ చూసే అవకాశం ఉందని ఓ ఊహాగానం.ఇప్పటికే టికెట్ రే ట్లను తగ్గించి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు ఇకపై ప్రీ సెన్సార్ వర్క్ ను కూడా తానే చేయనుందని తెలుస్తోంది.ఇదే కనుక జరిగితే మంత్రి వెల్లంపల్లి ఏం అవుతాడో! లేదా ఆ శాఖ దందాలూ,అక్రమా లూ ఏమౌతాయో! ఇప్పటికే మంత్రి అక్రమాలపై జనసేన వరుస వివరాలు, కథనాలు అందించి సంచలనం అయింది. వాటి స్ఫూ ర్తి తోనే ఈ కథ ఉంటుందా లేకా పూర్తి స్వేచ్ఛాయుత ధోరణిలో సర్వసాధారణంగాజరిగే కథకు ధర్మక్షేత్ర ఆనవాలుగా నిలిచిందా అన్న ది మరికొద్ది నెలల్లోనే తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి