ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున మహిళలకు ప్రత్యేకం అని చెప్పాలి. అయితే నేడు మహిళలు అన్ని రంగాలలోనూ పురుషులకంటే ఎక్కువగా తమ పాత్రను పోషిస్తున్నారు.
నాటికి నేటికి కాలం ఎంతగానో మారింది. మారుతున్న సమాజంలో మహిళలు కూడా ఎంతగానో పురోగతిని సాధించారు... సాధిస్తున్నారు. సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతున్నారు. అయితే మహిళలకు సంబందించిన ఒక సర్వే లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. టెక్నాలజీ అనలిటిక్స్ అనే సంస్థ టెక్‌ఆర్క్, మహిళల ప్లాట్‌ఫామ్ షీట్‌వర్క్ సంయుక్తంగా ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఏమి వివరాలు వెల్లడయ్యాయి అంటే,
మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాలలో మహిళలు అధికంగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తమ లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల లోటు, సాంకేతిక వనరులు, దిశా నిర్దేశం చేసే మెంటర్లు అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి అవరోధాలు వారి అభివృద్ధికి అడ్డు పడుతున్నట్లు సర్వేలో తెలిసింది. అంతే కాకుండా ఆర్ధిక సహాయం ఒక కారణమని తెలుస్తోంది. దీని ప్రకారం నాన్-మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 50 శాతం మంది తమ కెరియర్ కొరకు టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఎంపిక చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.
అందుకోసం ముందు నుండే అందుకు సంబంధించినటువంటి విద్యను అభ్యసించడం, ప్రత్యేక శిక్షణ తీసుకోవడం వంటివి చేస్తునారట. 'భారత్‌లో మహిళా టెక్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ స్థితిగతులు' అనే అంశంపై దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 2,000 మంది వరకు మహిళలు పాల్గొనగా, వీరిలో ప్రొఫెషనల్స్, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉండటం విశేషం. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుస్తోంది ఏమిటి అంటే ఆర్దికంగా అండ, మూలధనం ఏర్పాటు, అలాగే టెక్నాలజీ కొరత ఎక్కువగా ఉంటున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి