అవును తెలుగుదేశంపార్టీ వైఖరి చూస్తుంటే సగమే హ్యాపీ అయినట్లుంది. అసెంబ్లీలోపల గానీ బయటగానీ డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయాలని టీడీపీ డిసైడ్ చేసుకున్నది. అందుకనే రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా చంద్రబాబు అండ్ కో జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇపుడు జంగారెడ్డి మరణాల విషయంలో జగన్ రాజీనామాను అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ముఖ్యమత్రిని, మంత్రులను మాట్లాడనీయకుండా పదే పదే గొడవ చేస్తున్న కారణంగా ఐదుగురు ఎంఎల్ఏలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
అసెంబ్లీ మొదలైన దగ్గరనుండి టీడీపీ నేతల వరస ఇలాగే ఉంది. ముఖ్యమంత్రిగా మాత్రమే తాను సభలోకి అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు తమ్ముళ్ళను మాత్రం పంపుతున్నారు. చంద్రబాబు లేని సభను సజావుగా ఎందుకు జరగనివ్వాలని తమ్ముళ్ళు అనుకున్నట్లున్నారు. అందుకే బడ్జెట్ సమావేశాలు మొదలైన దగ్గర నుండి సభలో నానా రచ్చ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగ సమయంలో సభ్యులెవరు గోల చేయరు.
కానీ తమ్ముళ్ళు మాత్రం బడ్జెట్ కాపీలను చింపి గవర్నర్ మీదకే విసిరారు. గవర్నర్ ను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుకున్నారు. అదేమంటే గవర్నర్ అంతా తప్పుటే చెప్పారంటు ఆరోపించారు. ఏ గవర్నర్ అయినా ప్రభుత్వం రాసిచ్చిందే చదువుతారని తెలియదా ? తెలిసినా ఏదో రకంగా రచ్చ చేయాలని అనుకున్నారు కాబట్టే కంపుచేశారు. ఇపుడు జగన్+మంత్రులను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుకున్నారు. అలాగే పోడియం దగ్గరకు వెళ్ళి కాగితాలు చింపి స్పీకర్ మీదకు విసిరి కొట్టారు. దాంతో అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్ ను సెషన్ మొత్తానికి సస్సెండ్ చేశారు.
ఇక్కడే టీడీపీ ఎంఎల్ఏలు సగం మాత్రమే హ్యాపీగా ఉన్నారట. సభలో గోల చేసి జనాలందరి దృష్టిని ఆకర్షించాలనేది తమ్ముళ్ళ వ్యూహం. తాము ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే అధికారపార్టీ తమను మాట్లాడనీయటం లేదని గోల చేయటమే తమ్ముళ్ళ టార్గెట్. ఈ క్రమంలో ఎంఎల్ఏలందరినీ సస్పెండ్ చేస్తే బయటకు వెళ్ళి మరింత రచ్చ చేయాలని తమ్ముళ్ళనుకున్నారు. కానీ స్పీకర్ మాత్రం ఐదుగురిని మాత్రమే సభనుండి బయటకుపంపటంతో తమ్ముళ్ళు పూర్తి హ్యాపీగా లేరని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి