రాజధాని అమరావతి వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యంపై ఉత్కంఠ మొదలైంది. రాజధాని వివాద పరిష్కారంలో కేంద్రప్రభుత్వం జోక్యాన్ని రాష్ట్రప్రభుత్వం కోరవచ్చు కదా అన్న సుప్రింకోర్టు సూచనతో ఇపుడందరి దృష్టి కేంద్రంపై పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని అమరావతి రైతులు, టీడీపీ నేతలు హైకోర్టులో కేసువేశారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు రైతులు, టీడీపీ నేతల వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ వాదనను కొట్టేసింది.






హైకోర్టు తీర్పు పూర్తిగా రైతులు, టీడీపీ నేతల వాదనలకు మద్దతుగా ఉందనే అభియోగంతో ప్రభుత్వం సుప్రింకోర్టులో చాలెంజ్ చేసింది. దానిపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాయర్లు శ్యాందివాన్, నారీమన్ వాదనలు వినిపిస్తు పార్లమెంటుద్వారా ఏర్పడిన చట్టంలో ఒక రాజధాని అనిమాత్రమే ఉందన్నారు. పార్లమెంటు చేసిన చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం ఇపుడు మూడురాజధానులంటే చెల్లదన్నారు.





హైకోర్టు ఏర్పాటు క్యాబినెట్, పార్లమెంటు సిఫారసు మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమరావతిలో ఏర్పాటైంది కాబ్టటి రాష్ట్రప్రభుత్వం తనిష్టం వచ్చినట్లు మార్చుకునేందుకు లేదని గట్టిగా వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తు పార్లమెంటు ద్వారా ఏర్పడిన చట్టంలో అవసరమైన మార్పులు చేయాలని కేంద్రాన్నే కోరవచ్చుకదా అని ప్రభుత్వ లాయర్ కేకే వేణుగోపాల్ కు సూచించింది. అలాగే హైకోర్టు తరలింపు విషయంలో కూడా మళ్ళీ క్యాబినెట్ సహకారంతో రాష్ట్రపతిని సంప్రదించవచ్చుకదా అని అడిగింది.

అలాగే 



ఇక్కడే నరేంద్రమోడీ ప్రభుత్వంపాత్ర కీలకంగా మారింది. సుప్రింకోర్టు ధర్మాసనం సూచించినట్లుగా విభజన చట్టంలో సవరణలు కావాలంటే అందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకోవాల్సిందే.  కేంద్రప్రభుత్వానికి ఎప్పుడు అవసరం వచ్చినా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం సంపూర్ణమద్దతిస్తునే ఉంది. ఇపుడు కేంద్రసహకారం అవసరమైంది కాబట్టి జగన్ వెంటనే  నరేంద్రమోడీ సాయాన్ని కోరితే ఏమంటారనే విషయంలో ఉత్కంఠ మొదలైంది. మోడీ తలచుకుంటే అసలు సుప్రింకోర్టులో వాదనలతో కూడా పనుండదు. ఎన్నిరాజధానులైనా పెట్టుకోవచ్చని, హైకోర్టును ఎక్కడైనా పెట్టుకోవచ్చని పార్లమెంటు చట్టం చేయాలంటే మోడీ గట్టిగా అనుకుంటేనే సాధ్యమవుతుంది. మరి జగన్ ఏమిచేస్తారు ? మోడి ఎలా స్పందిస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: