పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంతవరకు ప్రజాస్యామ్యం, రాజ్యాంగం, హక్కులు, న్యాయం, చట్టం గురించే మాట్లాడే నరేంద్రమోడీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం పార్లమెంటులో  ఢిల్లీ పరిపాలనా సేవల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. సరే ఇపుడున్న బలం కారణంగా ఇటు లోక్ సభలోను అటు రాజ్యసభలోను బిల్లు గెలవటం పెద్ద కష్టమేమీకాదు.





కానీ అసలు బిల్లును తయారుచేయాలని అనుకోవటమే మోడీ చేసిన పెద్ద తప్పు. అలాంటిది బిల్లు తయారుచేసి ఆమోదంకోసం  పార్లమెంటులో ప్రవేశపెట్టడమంటే మోడీ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారా అన్న ఆశ్చర్యమేస్తోంది. బిల్లు వ్యవహారం చూస్తుంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే మోడీకి ఎంతలా కసిపేరుకుపోయిందో అర్ధమవుతోంది. ప్రజాస్వామ్యబద్దంతా కేజ్రీవాల్ ను ఎన్నికల్లో ఓడించలేని మోడీ దొడ్డిదారిలో దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకనే ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లును సభలో ప్రవేశపెట్టారు.





ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉండటాన్ని మోడీ సహించలేకపోతున్నారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రయిన కేజ్రీవాల్ అంటే మోడీ బాగా మండిపోతున్నారు. అందుకనే ప్రజా ప్రభుత్వం స్ధానంలో కేంద్రప్రభుత్వం తరపున ప్రతినిధిని నిలబెట్టి ప్రభుత్వ వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. దీన్ని హైకోర్టు అడ్డుకుని చివాట్లు పెట్టినా మోడీ తన ప్రయత్నాలను ఆపలేదు. అందుకనే తాజాగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.





ఈ బిల్లు ఆమోదంపొందితే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారాలన్నింటికీ కోత పడిపోతుంది. లెఫ్ట్ నెంట్ జనరల్ (ఎల్జీ)ని ముందుపెట్టి ఢిల్లీ పాలనా వ్యవహారాలను కేంద్రప్రభుత్వమే నడిపేట్లయితే ఇక ఎన్నికలు ఎందుకు ? ప్రజాప్రభుత్వం ఎందుకు ? అసెంబ్లీ ఎందుకున్నట్లు ? అన్నింటినీ రద్దుచేసి యావత్ ఢిల్లీ పాలనను కేంద్రం గతంలో లాగే తన చేతుల్లోకి తీసేసుకోవచ్చు కదా. ఆప్  ప్లేసులో ఇపుడు బీజేపీ అధికారంలో ఉండుంటే కేంద్రం ఇలాంటి ఆర్డినెన్సును, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టుండేదేనా ? కచ్చితంగా కాదనే చెప్పాలి. కేజ్రీవాల్ ను ఎలాగైనా నియంత్రించాలనే కసితో మోడీ నియంత్రణ బిల్లును పట్టుకొచ్చారు. ఇపుడు ఢిల్లీ ప్రభుత్వమైంది రేపు ఇంకో రాష్ట్రమవుతుందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: