ఇక ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఎంపీగా కూడా పనిచేశారు అని చెప్పాలి. ఇక సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి అడిగితే ఆయన ఓటమి ఎరుగని గొప్ప రాజకీయ నాయకుడు అని చెబుతూ ఉంటారు. కానీ కెసిఆర్ ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయాడు అన్న విషయం కాస్త ఆ టాపిక్ గా మారిపోయింది. కేసీఆర్ ని ఓడించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఒక వ్యక్తి ఓడించారు.
1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీ చేయగా. ఇక ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనంతుల మదన్మోహన్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్ కేసీఆర్ పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు అయితే కెసిఆర్ కు ఇదే మొదటి ఓటమి అని చెప్పాలి. ఆ తర్వాత 13 సార్లు విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే.. ఐదుసార్లు ఎంపీగా గెలిచారు కెసిఆర్. ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్.. ఇక 2004లో మరణించారు. అయితే మోహన్ ను కేసీఆర్కు గురువు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వివరణ ఇస్తూ ఉంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి