తెలుగు సినీ ఇండస్ట్రీలో నారా రోహిత్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నటించలేదు.. నారా రోహిత్ నటించిన సినిమాలు కూడా లాభాలు తెచ్చిన పరిస్థితి కూడా ఏ సినిమాకి కనిపించలేదు. 80 శాతం వరకు నష్టాలే అంటూ నిర్మాతలే చెబుతున్నారు. అవి కూడా 30 నుంచి 40 కోట్ల రేంజ్ బడ్జెట్ సినిమాలేనని సమాచారం. ఇలా నష్టాలు వచ్చినప్పటికీ సరే ఆపకుండా వరుస పెట్టి సినిమాలు చేసి ఏడాదిలో ఆరు సినిమాలు తీసిన హీరోగా పేరు సంపాదించారు నారా రోహిత్.


అయితే వీటి వెనుక బ్లాక్ మనీ దందా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం నారా రోహిత్తో కొంతమంది నిర్మాతలు పదేపదే ఫ్లాప్ సినిమాలు తీసినట్లు తెలుస్తోంది. ఒకసారి దర్శకత్వం వహించి ఫ్లాప్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ అదే హీరోతో మళ్ళీ అదే నిర్మాతకు కూడా ఇలా ఎన్నో చాన్సులు ఇవ్వడం వల్ల కొన్ని రకాల అనుమానాలు మొదలయ్యాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక నారా రోహిత్ ఎన్నో సినిమాలలో నటించారు..


అంటే 2014 ముందు వరకు కూడా పెద్దగా సినిమాలు లేవు 2019 తర్వాత చంద్రబాబు అధికారం లేకపోయినా సినిమాలు లేవు.. 2014 నుంచి 19 వరకు 17 సినిమాలు చేశారట. దీంతో అటు నారా రోహిత్ సినిమాలకు చంద్రబాబుకు ఏదో సంబంధం ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సంబంధమే బ్లాక్ మనీ సంబంధమట... చంద్రబాబు ప్రభుత్వంలో కొంతమంది కాంట్రాక్టులు డైరెక్ట్ గా ముడుపులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారట.అంతే కాకుండా జీఎస్టీ వచ్చాక మొత్తం బిల్లు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి వచ్చింది. అలా ఎంత చెల్లించిన లెక్కలను అయితే కి లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీంతో చంద్రబాబుకు వాటా ఇవ్వడం ఎలా అన్నట్లుగా ఆలోచించిన చంద్రబాబు మాస్టర్ మైండ్ తో తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకుని నారా రోహిత్ గా హీరోగా పెట్టి పలు సినిమాలను తెరకెక్కించి నిర్మాతలు దర్శకులకు కొంతమేర వాటా ఇచ్చారనీ సమాచారం.

ఐదు కోట్లు ఖర్చు అయ్యే సినిమాలకు 40 కోట్లు బడ్జెట్ అని చూపించి 35 కోట్లు నేరుగా చంద్రబాబు బగ్లాకు చేరిపోయేవట. అలా ప్రతి ఏడాది కూడా ఆరేడు సినిమాలు తీస్తూ ఉన్నారట నారా రోహిత్. 2009లో బాణం, 2011లో సోలో, 2012లో సారొచ్చారు, 2013లో ఒక్కడినే ఇలా ఎన్నో సినిమాలను చేశారు. అలా 2019 నాటికి 17 సినిమాలు చేసి డిజాస్టర్ గా మిగిలాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: