ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకింగ్ ఎపిసోడ్ ఎదురైంది. అదేమిటంటే  జనసేనలో చేరటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదని ప్రకటించారు. పవన్ కు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పెద్ద లేఖ రాశారు. ఆ లేఖలో తనను పవన్ నమ్మించి మోసంచేసినట్లు ఆరోపించారు. తనను వచ్చి కలుస్తానని రెండుసార్లు కబురుచేసి రెండుసార్లు రాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. బహుశా తనను కలవటానికి పవన్ కు అనుమతి దొరకలేదేమో అని సెటైర్ పేల్చారు.





ముద్రగడ డైరెక్టుగా చెప్పలేదుకాని చంద్రబాబునాయుడు అనుమతి లేకుండా పవన్ ఏపనిచేయడని చెప్పకనే చెప్పారు. లేదా పవన్ ఏపని చేయాలన్నా అందుకు చంద్రబాబు అనుమతి ఉండాలన్న అర్ధంలో  మాట్లాడారు. ఏదేమైనా పవన్ బాస్ చంద్రబాబు అన్న విషయాన్ని ముద్రగడ స్పష్టంగా చెప్పేసినట్లే. టీడీపీ పొత్తులో జనసేన 80 సీట్లు తీసుకునుంటే బాగుండేదని ఉద్యమనేత అభిప్రాయపడ్డారు. రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని షేరింగ్ అడిగుంటే బాగుండేదన్నారు. అయితే అలాంటివి ఏమీలేకుండానే కేవలం 24 అసెంబ్లీ సీట్లు తీసుకుని సరిపెట్టుకోవటం తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు.





జనసేన తీసుకున్న 24 సీట్లకు పవన్ కు తన అవసరం ఏమాత్రం లేదని ముద్రగడే అబిప్రాయపడ్డారు. జనసేనకు తన అవసరం రాకూడదనే తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు పరపతి పెరగటానికి పవన్ కారణమని ఉద్యమనేత లేఖలో గుర్తుచేశారు. అయితే మరీ గుమ్మాల దగ్గర పడికాపులు కాసే వ్యవహారం  తనది కాదని కూడా చెప్పారు.





తనకు గ్లామర్ లేకపోవటం వల్ల, ప్రజల్లో పరపతి లేనివాడిని అన్న ఉద్దేశ్యంలోనే పవన్ దృష్టిలో తాను ఉత్త ఇనుపముక్కలాగ అయిపోయినట్లు ఎద్దేవాచేశారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీచేయటాన్ని కాపు ప్రముఖులతో పాటు సామాజికవర్గం ఏమాత్రం అంగీకరించటంలేదని అర్ధమైపోయింది. మరీ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీల మధ్య ఓట్లబదిలీ ఎలాగ అవుతుంది ? అసలు అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా జనసేన పోటీచేయాలని అనుకున్న సీట్లను చంద్రబాబు లాగేసుకుంటున్నారు. దీంతో కాపుల్లో బాగా  మండిపోతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: