ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విషయం పైన అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.. నిన్నటి రోజున గోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే అప్పటివరకు ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.. అంతేకాకుండా భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చోటే గెలుస్తానని శపధం కూడా చేశారు.. ఈ క్రమంలోనే ఆయన మరొకసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకోగా నిన్నటి రోజున జనసేన పార్టీ సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసన్ కూడా గుండా అంటూ పలు రకాల ఆరోపణలను చేశారు.
భీమవరం ఎమ్మెల్యే పైన పవన్ కళ్యాణ్ మాటల్లో చూసి అందరూ ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తారని సీఎం జగన్ వేసిన ప్లాన్ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అక్కడి నుంచి మారిపోయి అక్కడైతే ఓడిపోయి పరువు పోతుందని భయంతో భీమవరం నుంచి ఒకసారిగా పిఠాపురం కి షిఫ్ట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.. వచ్చే ఎన్నికలలో సీఎం జగన్ ని టార్గెట్ చేసిన వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ముఖ్యంగా భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ బలంతో పాటు పార్టీ పార్టీ కూడా చాలా బలంగా ఉన్నది. అంతేకాకుండా అభివృద్ధి పనులు కూడా చాలానే చేయడంతో ఆ నియోజకవర్గంలో వైసిపి పార్టీకి చాలా అనుకూలంగా ఉందని సర్వేలు తేలడంతో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓడిపోతాడనే భయంతో పిఠాపురానికి మారినట్లు తెలుస్తోంది. భీమవరం నుంచి పులివర్తి రామాంజనేయులు ప్రకటించారు పవన్. ఆయన రెండు రోజుల క్రితం టిడిపి నుంచి జనసేన లకి వెళ్లారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి