దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి..సామాన్య ప్రజలు, పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు..పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా యువకులు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సోమవారం హోలీ వేడుక ఘనంగా నిర్వహించారు.మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, 3వ వార్డు కౌన్సిలర్‌ రమావత్‌ కోటేశ్వరరావు నాయక్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని 3వ వార్డులో సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు భారీ సంఖ్యలో ఎదురెళ్లి మంత్రి అంబటి రాంబాబుకి హారతులు పట్టారు. ప్రతి ఇంటి వద్ద అంబటి రాంబాబుకి రంగు పూసి మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.అలాగే ఉట్టి కొట్టి రాంబాబు సంతోషపు రంగులను విరజిమ్మారు.

బంజారా మహిళల సంప్రదాయ కోలాటం మరియు సంప్రదాయ నృత్యాల్లో వారితో కలిసి నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి గెలిచే సంప్రదాయ ప్రతీక హోలీ పండుగ అని ఆయన అన్నారు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా చెడుపై మంచి గెలుస్తుందని, మీరందరూ ఆశీర్వదిస్తే ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబును పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకుడు పక్కాల సూరిబాబు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, పార్టీ నాయకులు డాక్టర్‌ సయ్యద్‌ సలీం, షేక్‌ మొహమ్మద్‌ గని, హైదరాబాద్‌ సుభాని, తోట లక్ష్మీనారాయణ, శిరిగిరి వెంకట్రావు, హనీఫ్‌, నాయకులు, కార్యకర్తలు మరియు బంజారా మహిళలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: