ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక అన్ని పార్టీలు కూడా మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయ్. ఇలాంటి సమయంలో ఇక పార్టీ ఫిరాయింపులతో అటు తెలంగాణ రాజకీయాలను మరిత సంచలనంగా మారిపోతున్నాయి. బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. గతంలో ఏకంగా బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి బిఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కూతురు కడియం కావ్య కారు దిగి కాంగ్రెస్ చేయి అందుకున్నారు.


 మరోవైపు సీనియర్ నేత కేకే ఇక ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిర్మొహమాటంగా అటు కారు నుంచి దిగి హస్తంతో చేతులు కలిపారు అన్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ కేవలం బిఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారని ఇక ఆ పార్టీని త్వరలోనే ఖాళీ చేస్తారని అందరూ అనుకుంటుండగా.  కేవలం బి ఆర్ ఎస్ ను మాత్రమే కాదు బిజెపిని కూడా వదలబోను అనే రేంజ్ చేరికలను ప్రోత్సహిస్తున్నాడు రేవంత్.


 బిజెపి నేత మాజీ ఎంపీ ఇక ఇప్పుడు కాశయం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు   మాజీ ఎంపీ డీ.రవీంద్ర నాయక్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా 2004లో వరంగల్ ఎంపీగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరిన ఆయన అనంతరం 2019లో కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. కానీ గత నెలలో బిజెపికి రాజీనామా చేసి ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. బంజారా కమిషన్ ఏర్పాటు పట్ల బీజేపీ నాయకత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. అంతేకాకుండా ఆ పార్టీలో ఉన్న సీనియర్ లంబాడి నాయకుడు అయిన తనను ఏ విషయంలోను బిజెపి నేతలు సంప్రదించకుండా అవమానిస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: