ప్రస్తుతం ఒంగోలులో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఒంగోలు ఎంపీ సీట్ చాలా కాస్ట్లీ గా మారింది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి టిడిపి నుంచి పోటీ చేస్తూ ఉండగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.  ఎన్నికల అఫిడవిట్ లో  మాగుంట  ఆస్తులు ఏమి చూపించలేదు.  కానీ చెవిరెడ్డి మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులను చూపించారు. ఆయన ఆస్తులు ఏ విధంగా చూపించారో ఆ విధంగానే నియోజకవర్గ ప్రజలను కూడా డబ్బులతో కొనాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొన్నటి వరకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీ సీట్ కోసం కొట్టుకుంటున్నారు. చెవిరెడ్డి లోక్ సభ అభ్యర్థిగా ప్రకటన అయినప్పటి నుంచి ప్రతి మండల కేంద్రంలో భోజనాలు పెట్టిస్తూ,  నాయకులకు తాయిలాలు అందిస్తున్నారు.

 అంతేకాకుండా వాలంటీర్ల దగ్గర నుంచి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కౌన్సిలర్లు, పార్టీ ఇన్చార్జిలకు డివిజన్ అధ్యక్షులను బట్టి డబ్బులు పంపుతున్నారట. అయితే మార్కాపురం, కనిగిరి, గిద్దలూరులో, ఒక్కొక్కరికి లక్ష పంపిణీ చేశారట. ఇక ఒంగోలులో ఒక్కో కార్పొరేటర్ కు మూడు లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ డబ్బులు పంచడం కోసం తన సొంత క్యాడర్ ను వాడుకోకుండా  చంద్రగిరి నుంచి వచ్చిన మనుషులను వాడుకుంటున్నారట. దీంతో అక్కడ వైసీపీ నాయకులను చెవిరెడ్డి నమ్మడం లేదని  అంతేకాకుండా కొంతమంది నాయకులకు లక్ష కొంతమందికి మూడు లక్షలు ఇలా డబ్బుల విషయంలో తారతమ్యాలు రావడంతో వైసిపి కేడర్ అంతా చెవిరెడ్డి పై గుస్సా అవుతున్నారట. ఈ విధంగా ఒంగోలు లోక్ సభ లో హడావిడి చేస్తున్నారని, ఆయన చేస్తున్నటువంటి అతి మొదటికే మోసం వచ్చేలా ఉన్నదని తెలుస్తోంది.

ఈ తరుణంలోనే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా  వైసీపీ కార్యకర్తలతో టచ్ లో ఉన్నారట. ఒక ఆఫీస్ ఒంగోలులో, మరో ఆఫీస్ మార్కాపురంలో పెట్టుకొని 24 గంటలు నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇక చెవిరెడ్డి మాత్రం ఎక్కడా కూడా అఫీషియల్ గా  ఆఫీస్ మాత్రం ప్రారంభించలేదు.కానీ డబ్బులతో అంతా కొనేయాలనే ఆలోచనతో ఉన్నారట.  అంతేకాకుండా ఆయన ప్రచారం కూడా తక్కువగానే చేస్తూ తన వారసుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్న చంద్రగిరి పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన టీంతో మాత్రమే ఈ తతంగం అంతా నడిపిస్తూ ప్రచారంలో పాల్గొనక పోవడం వల్ల అక్కడి కార్యకర్తలు, ప్రజల్లో మైనస్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: