టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కి లక్ కలిసి వచ్చి ఉంటే ఈపాటికి ఎప్పుడో సీఎం అయ్యేవారు.. 2017లో అంటే 34 ఏళ్ల వయసులోనే కీలక మంత్రిత్వ శాఖలు కూడా చూశారు.. ముఖ్యంగా లోకేష్ అతి చిన్న వయసులోనే పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి వంటి శాఖలలో పనిచేశారు. 2019లో టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా సీఎం అభ్యర్థిగా నారా లోకేష్ కి ప్రపోజల్ ఉండేది.కానీ అలా జరగలేదు. దీంతో ఈసారి ఎన్నికలు టిడిపి పార్టీకి డెడ్లైన్ గా మారిపోయాయి.


ఈసారి ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే లోకేష్ కి బాధ్యతలు ఖచ్చితంగా అప్పగిస్తారని.. ఎన్నికలలో టిడిపి అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రిత్వ షాకలో లోకేష్ సమర్థ మంత్రిగా తనని తాను ప్రూఫ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.2029 నాటికి లోకేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు టిడిపి పార్టీ తెలుస్తోంది. ఇప్పటికి టిడిపి వర్గాలలో కూడా ఇందుకు సంబంధించి చర్చ నడుస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే సీనియర్ నేతలు మాత్రం ఇప్పటికే లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం చాలా తొందరపాటు అంటూ కూడా తెలియజేస్తున్నారు.


గతంలో కంటే ఈ మధ్యకాలంలో లోకేష్ బాగానే ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు.. కానీ జగన్ లాగా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు..అలాగే మంచి క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు.. దీన్నిబట్టి చూస్తే మరింత రాటు తేడాల్సి లోకేష్ ఉందనే విధంగా సీనియర్ల భావన వినిపిస్తోంది. ప్రస్తుతం బాబు వయసు కూడా ఏడున్నర పదులు వయసు దాటడంతో పాటు ఇప్పటికే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మొత్తానికి టిడిపి లోకేష్ కి అత్యున్నత పదవి ఇవ్వాలని చాలామంది నేతలు ఆరాటపడుతున్నారు..టిడిపి పార్టీలో లోకేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారని కూడా చెప్పవచ్చు.. మరి ఇలాంటి సమయంలో లోకేష్ సీఎంగా అవ్వనిస్తారా లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: