కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో పోయిన సారి కంటే భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. దానితో కూటమి నాయకులు , కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే మా పార్టీ కి ఓట్లు వేయడం కోసమే వారంతా కదిలి వచ్చారు అని , కూటమి నేతలు కార్యకర్తలు చెప్పుతూ ఉంటే వై సీ పీ పార్టీ అభిమానులు మాత్రం తెలుగు దేశం , జనసేన , బీ జే పీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి.

మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల వై సీ పీ కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా అని వారంతా వచ్చి ఓట్లు వేశారు. అందుకే భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. అధికారం లోకి రాబోయేది మేమే అని వారు చెబుతూ వస్తున్నారు. ఇక ఎవరు గెలవబోయేది. ఎవరు అధికారం లోకి రాబోయేది రిజల్ట్ డే అయినటువంటి జూన్ 4 వ తేదీన క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ లోపు ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. ఇకపోతే వై సీ పీ ప్రభుత్వం కు మాత్రం కొన్ని గంపగుత్త ఓట్లు ఉన్నట్లు విశ్లేషకులు ఎప్పటి నుండో చెబుతున్నారు.

అవి ఏవో కావు జగన్ అధికారం లోకి వచ్చాక కొన్ని వర్గాల వారికి చాలా మంచి పనులు చేశాడు. వృద్ధులకు పెన్షన్స్ సరైన సమయానికి ఇవ్వడం , అలాగే రైతులకు సహాయం చేయడం. ఇలా మరికొన్ని పథకాలను జగన్ చాలా శ్రద్ధతో చేశాడు. దానితో ఇలాంటి పథకాలను పొందే వారు గంపగుత్తగా వై సీ పీ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది అని దానితో వీరు భారీ మొత్తం సీట్లను కూడా గెలుపొందే అవకాశం ఉంది అని పలువురు అంచనా వేస్తున్నారు. మరి వై సీ పీ పార్టీ రెండవ సారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారం లోకి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp