సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వచ్చి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. జనసేన పార్టీని పెట్టి పదేళ్లు అయిన ఇప్పుడు కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం స్థానాన్ని అందుకున్నారు. ముఖ్యంగా సినిమా నటుడు కూడా కావడం చేత ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది. అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం అప్పుడు కానీ లేకపోతే సభలో ఇప్పుడు ఉన్నప్పుడు ఆ హెయిర్ స్టైల్ వచ్చేటప్పుడికి సరిగ్గా లేదు. అది కూడా స్టైల్ అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు. కాకపోతే అలా లేదు.


ఏమిటంటే అది తన సినిమాకు సంబంధించినటువంటి హెయిర్ స్టైల్ ఆట. ఇప్పుడున్నటువంటి హీరోలు ఎక్కువగా విగ్గులు వాడడం లేదు. ఆ తరహాలో ఒరిజినల్ గాని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత హెయిర్ స్టైల్ ని సరి చేసుకుంటూ ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమా కోసం ఆ స్టైల్ తో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు పవన్ కళ్యాణ్.. అందుకోసమే పవన్ కళ్యాణ్ క్రాఫ్ చేయించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రాఫ్ చేయిస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎంగర్ గా కనిపిస్తూ ఉంటారు.


ముఖ్యంగా ఎన్నికలలో గెలిచినప్పుడు తన అన్నయ్య చిరంజీవికి కాళ్లు మొక్కి మరి ఆశీర్వాదం పొందారు.. అయితే మరి కొంతమంది కార్యకర్తలు , నేటిజన్స్  సైతం అసెంబ్లీకి అలానే వస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో మారిపోతారంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. మరి తను ఒప్పుకున్న సినిమాలను పూర్తిగా ఫినిష్ చేసి ఎక్కువగా రాజకీయాలకే పరిమితం అయ్యేలా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇలా జరిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరింత పుంజుకుంటుందని చెప్ప వచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: