ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రయోజనాలు పొందడం కొత్తేం కాదు. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయానికొస్తే.. ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నారనే తేడా లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు కూడా ఇలాంటి సెక్యూరిటీ ని లభిస్తుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా బాగా పబ్లిసిటీ కూడా లభిస్తుంది. ఇటీవల నాగబాబుకి సంబంధించి ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు ఆయనతో సమావేశమై శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాగా, ఆయన సోదరుడు నాగబాబుకు ప్రభుత్వ పదవి లేదు.  అందుకే, నాగబాబుతో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు భేటీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఈ సమావేశం పవన్ అనుచరులు, అతని పార్టీ JSP మద్దతుదారులను అయోమయంలో పడేసింది, దీని ఉద్దేశ్యం అర్థం కాలేదు. ఆయన ఉపముఖ్యమంత్రి సోదరుడు కావడం వల్ల ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిగినట్లు తెలుస్తోంది. అయితే నాగబాబును పోలీసులు ప్రత్యేకంగా సందర్శించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు డిప్యూటీ సీఎం తాలూకా అనే పదం ట్రెండింగ్‌లో ఉంది. మెగా బాబులకే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది.

ఇకపోతే నాగబాబుకు ప్రభుత్వంలో ఏదో ఒక మంచి హోదా కల్పిస్తారని ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది టిటిడి చైర్మన్ అవుతారని కూడా అన్నారు కానీ తాను దేవుళ్లను నమ్మను అని తనను తాను మాత్రమే నమ్ముకుంటానని నాగబాబు ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేయడానికి ఒప్పుకోకపోవచ్చు. అయితే నాగబాబు జనసేన పార్టీలో కొన్ని రోజులు పని చేశారు. ఆ కారణంగా పవన్ కళ్యాణ్ అతనికి ఏదో ఒక పదవి ఇప్పించే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబును పవన్ అడిగితే ఎలాంటి పదవి అయినా ఇస్తారని కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: