రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇటీవల మృతి చెందడం జరిగింది.. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప సభలను కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా రామోజీరావు సంస్కరణ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు పనులను కూడా చేస్తోంది... ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి కొన్ని ఏర్పాట్లను కూడా తానే స్వయంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే రామోజీరావు జీవిత యొక్క విశేషాలు పత్రికా రంగానికి ఆయన చేసినటువంటి సేవలను గురించి ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్లతోపాటు షార్ట్ ఫిలిం లను కూడా  నిర్వహించబోతున్నారట.


ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణతోపాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా రంగాలకు చెందిన ప్రజాప్రతినిధులు రామోజీ కుటుంబ సభ్యులకు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఏర్పాటు కోసం ఐదు కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. రామోజీరావు జ్ఞాపకాలను సైతం చిరస్థాయిగా ఉండేలా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


ఏపీ ప్రభుత్వం రామోజీరావుకు అత్యున్నత దూరం ఇవ్వాలని భావిస్తోందట. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యం లో సంస్కరణ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ పేరును రామోజీ ప్రెస్ అకాడమీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును కూడా ఆయనే సూచించినట్లుగా సమాచారం అలాగే రామోజీ విగ్రహాన్ని కూడా రాజధాని ప్రాంతంలో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా ఈ విషయం పైన స్థలాన్ని కూడా కేటాయించారట. ఈనెల 27వ తేదీన రామోజీ సంస్కరణ సభ జరగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: