అంతేకాకుండా పోలీసులు హంతకులకు సైతం అండగా నిలిచారని వారి పైన కచ్చితంగా చర్యలు తీసుకునేలా కేసు విచారణ జరిపించాలి అంటు తెలిపింది. అంతేకాకుండా ఒకవేళ అవసరమైతే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ చెప్పిందట సునీత. వీటితో పాటు సాక్షులను బెదిరించి పోలీసులు ఈ కేసును పట్టించుకోకుండాలా చేశారంటూ సునిత వెల్లడించింది. వివేకా హత్య కేసులో బాధ్యతలకు కచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటు ఆమె హోం మంత్రి అనితకు విజ్ఞప్తి చేసుకున్నారట.
ఇక సునీత కూడా మాట్లాడుతూ తన తండ్రి హత్య కేసులో అన్ని విధాల సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ హోమ్ మినిస్టర్ అనిత కూడా సునీతకు తెలియజేశారట. దోషులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం అందుకు తగ్గ చిత్తశుద్ధితో కూడా పని చేస్తుందని తెలిపింది హోమ్ మినిస్టర్ అనిత. మరి కూటమి ప్రభుత్వానికి తమ విన్నపాలను వినిపించుకున్న సునిత ఈ ఐదేళ్ల లోపు ఆమె తన తండ్రి మరణానికి గల కారణం ఏంటని.. ఎవరు చంపించారనే విషయం పైన క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ కేసు పైన నిజాలు రాకపోతే మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి.