ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం చాలా రోజులుగా ఎదురు చేస్తున్నారు. ముఖ్యంగా 6100 పోస్టులకు వైసిపి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు.. గత ఎడారి ప్రిలిమ్స్ ఎగ్జాం పూర్తి అయ్యి 95,000 మందికి పైగా క్వాలిఫై అయ్యారు .. అయితే ఆ తర్వాత ఎన్నికలు హడావిడి రావడంతో ఈవెంట్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారం చేపబట్టడంతో కానిస్టేబుల్ నియామకాలను కంటిన్యూ చేస్తామని ఏడాదిలోపే ఉద్యోగాలలో చేరుతారనే విధంగా తెలియజేశారు.


అన్నట్టుగానే ఈ ఏడాది జనవరి నెలలో  95 వేల మందికి ఈవెంట్ నిర్వహించి PET పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇందులో కేవలం 38,910 మంది మాత్రమే అర్హత సాధించారు. వీరికి జూన్ 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలియజేసింది ఏపీ ప్రభుత్వం. ఇక అభ్యర్థులకు ఏదైనా మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ SLPRB.AP.GOV.IN వెబ్సైట్ని  సందర్శించాలంటూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కూడా తెలియజేసింది అభ్యర్థులకు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్ రాత పరీక్షకు సైతం నిర్వహించేందుకు కొన్ని సెంటర్లను నియమించింది..


అందులో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలలో నిర్వహించబోతున్నారు. ఇక కానిస్టేబుల్ మెయిన్ హాల్ టికెట్ పరీక్షకు ఒక వారం ముందు రిలీజ్ చేయబోతున్నారట. పైన తెలిపిన ఈ ఐదు కేంద్రాలలో ఎక్కడైనా ఒకచోట అభ్యర్థులను ఎగ్జామ్ రాసి అవకాశం ఉంటుంది. ఇక మెయిన్ ఎక్సమ్ 200 మార్కులకు ఉంటుంది సమయం మూడు గంటలు.


ఇక సబ్జెక్టుల వైజుగా విషయానికి వస్తే..

అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ సైస్, ఇండియా జాగ్రఫీ, ఇండియా కల్చర్, ఇండియా హిస్టరీ, పాలిటి అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్, ఇండియన్ నేషనల్ మూమెంట్  వంటి అంశాల పైన ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: