
అదేవిధంగా లు మాల్ పేరిట ఎలాంటి టెండర్ లేకుండానే సుమారుగా 1500 కోట్ల భూమిని ఇచ్చేశారు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో స్థానిక ప్రతినిధులతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి చూస్తూనే ఉన్నాము.. మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఫైరయ్యారు. ప్రతి బాటిల్ పైన 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించడం జరిగింది.
ఉచిత ఇసుక అన్న పేరుతో రెండింతలు ఎక్కువ దోస్తున్నారు.. ప్రజలను దృష్టి మరణించడానికి కొన్ని రకాల డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కూడా ఫైర్ కావడం జరిగింది. ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పిన హామీలను అమలు చేయని టిడిపి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నిలదీస్తున్నారంటూ తెలిపారు. టిడిపి నేతలు కార్యకర్తలు కూడా గ్రామాలలో ధైర్యంగా తిరగలేకపోతున్నారని తెలియజేశారు జగన్. ఏపీలో ఉండే వైద్య ,విద్యా రంగాన్ని కూడా చాలా దారుణంగా మార్చేశారని 4 లక్షల పింఛనీలను కూడా తొలగించారని ఫైర్ అయ్యారు. ఏపీ అంతా రెడ్ బుక్ పాలన నడుస్తోంది .. దీనివల్లే ప్రజా వ్యతిరేకత కూడా మొదలయ్యింది అంటూ దీన్ని ఆపడం టిడిపికి కూడా సాధ్యం కాదని తెలియజేశారు. ఇటీవలే ఉర్సా కంపెనీలకు భూమి కేటాయించడం కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.అలాగే జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో ఇటీవలే ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా సంతాపాన్ని ప్రకటించడం జరిగింది మాజీ సీఎం జగన్ . కొద్దిసేపు మౌనం కూడా పాటించారు.