
ఈ నియోజకవర్గాలలో ఎంపీ శబరి పర్యటిస్తే ఆమె కార్యక్రమాలలో కూడా టిడిపి ఎమ్మెల్యేలు అసలు పాల్గొనలేదు. ఒకవేళ అనుచరులు పాల్గొంటే వారికి కూడా వార్నింగ్ ఇస్తున్నారట. గతంలో నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శబరి ఆ తర్వాత టిడిపి పార్టీలోకి చేరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసింది. కూటమిలో భాగంగా మంచి విజయాన్ని అందుకున్న శబరి ఎంపీ అయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లిన ఆమెను పలకరించే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదట. దీంతో ఏ స్థాయిలో అక్కడ విభేదాలు ఉన్నాయో చెప్పుకోవచ్చు.
ఒకవేళ ఎంపీ శబరి కి ఏదైనా అవకాశం ఇస్తే ఆమె పెత్తనం చాలా ఇస్తారని చాలామంది నేతలు దూరం పెడుతున్నారట. అయితే ఎన్నికలలో మాత్రం 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్న ఇంత భారీ మొత్తంలో కూడా ఖర్చుపెట్టిన ప్రజా సమస్యలు పరిష్కరిద్దామని క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేయగా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రావడంలేదని శబరి అనుచరులు కూడా నిరుత్సాహ పడుతున్నారట. కానీ చాలామంది ఎమ్మెల్యేలకు డబ్బు ఖర్చు చేయడానికి ఇచ్చిందని శబరి అనుచరులు కూడా ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా శబరి పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చిన గౌరవం మాత్రం లభించలేదట.