ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో సింహాద్రి అప్పన్న స్వామి ఉత్సవాలలో తాజాగా అపశృతి జరిగినట్లుగా తెలుస్తోంది. స్వామి వారి నిజరూపాన్ని సైతం దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో ఏకంగా ఏడు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని నిన్నటి రోజున అర్ధరాత్రి ఈ ఘటన సింహాచలంలో జరిగింది. అయితే భారీ వర్షం కురచడంతో ఈ సంఘటన జరిగినట్లుగా అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువ వైపుకు వెళ్లే మార్గంలో ఉండేటువంటి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయలు టికెట్లు తీసుకొని మెట్లు ఎక్కుతూ ఉండగా  ఈ సిమెంట్ కూడా కూలినట్లుగా సమాచారం.


అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటుగా అధికారులు సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు సహాయక చర్యలు ఈ సంఘటన స్థలానికి చేరుకొని పర్యావేక్షిస్తున్నారు. ఏడు మంది మృతి దేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు.అయితే గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. నరసింహస్వామి నిజస్వరూపం దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు వెళ్లారు. ఇంకా శిధిలాల కింద మరికొంతమంది ఉండవచ్చు అని అనుమానంతో పదికి పైగా అంబులెన్స్లను అక్కడ ఉంచారట.


వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవలో పాల్గొనాలని ఆ వెంటనే స్వామి వారి నిజస్వరూపాన్ని విశేష అభిషేకాలతో నిర్వహిస్తారు. స్వామివారి నిజస్వరూపాన్ని సైతం దర్శించుకోవాలని వెళ్లిన భక్తులు ఈ సంఘటన జరగడంతో అక్కడ భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారుగా రెండు లక్షల మంది భక్తులు సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వచ్చారట. కుండపోతు వాన రావడంతో ఈ గోడ కూలిపోవడంతో అప్పన్న సన్నిధిలో ఈ విషాదం సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. మరి కొన్ని గంటలలో మృతుల వివరాలు తెలియజేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: