ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో తన పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఇందులో భాగంగా తనకు వచ్చిన అవకాశాన్నల్లా వినియోగించుకొని మరి ఏపీలో తన పేరు వినిపించేలా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.. అయితే ఇటీవలే పహల్గాంలో జరిగిన దాడిలో భాగంగా  ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.. అలాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పలు రకాల వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా రాజకీయాలలో పెను దుమారాన్ని రేపేలా చేస్తున్నాయి.


ఇటీవలె ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాకిస్థాన్ పైన ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లాలని తెలియజేశారు. ఈ విషయం పైన చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవుతూ పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలా చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడారు పవన్ ఎవరో రాసిస్తే స్క్రిప్టును చదవడానికి సిద్ధమవుతారు.. ఇదేమి సినిమా కాదు అంటూ ఎద్దేవా చేశారు 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేయడం ఒక సిగ్గుచేటు అంటే తెలియజేశారు.


అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడాలి అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన  వ్యక్తి మధుసూదన్ కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: