హిందువులు ఎక్కువగా దైవాన్ని ఆరాధ్య దేవతగా కొలుస్తూ ఉంటారు. అందుకే హిందువుల దేవాలయాలు అడుగడుగునా కూడా ఇండియా అంతట ఉంటాయి. దేవుడు దర్శనం చేసుకోవాలని విశిష్టమైన పండుగలు వేల కూడా దేవాలయాలకు వెళుతూ ఉంటారు. అయితే అలా వచ్చే భక్తులకు అక్కడ తగిన విధంగా పలు రకాల ఏర్పాట్లు చేయలేకపోవడంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా కొన్నిసార్లు ఘోరమైన ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి సంఘటనలు ఇప్పుడు ఏపీలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి.


భక్తితో దేవుడు దగ్గరకి రావడమే వీరు చేసిన పాపమా అనుకునేలా ఇప్పుడు భక్తుల పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహించే ప్రభుత్వ అధికారులు భక్తుల ప్రాణాలకు సంబంధించి ఎలాంటి మందస్తు ఏర్పాట్లు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇటీవల సింహాచలం చందనోత్సవానికి సుమారుగా రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చారట. దీనికి తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ కానీ.. ఒక గోడ వల్ల మృత్యు రూపంలో చాలామంది భక్తులు మరణించారు. అయితే ఈ గోడ కూడా గడిచిన కొద్ది రోజుల క్రితమే కట్టారట.


అలా కట్టిన కూడా ఎందుకు అంత త్వరగా పడిపోయింది అన్నది ఇప్పుడు ప్రశ్న?. చందనోత్సవం కోసం గడిచిన రెండు నెలలుగా పలు రకాల సమీక్షలు కూడా నిర్వహించారు. ప్రతి విషయాన్ని కూడా అధికారులు దగ్గరుండి మరి పరిశీలించినట్లు తెలియజేస్తున్నారు. అలాంటి సమయంలోనే గోడను కూడా నిర్మించామని.. ఇక ఆలయ ఆవరణంలో అటు రాజకీయ అండతో పాటు అధికారులు అండతో కూడా కొనసాగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉత్సవాల కోసం భక్తులకి క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశామని కానీ రద్దీ ఎక్కువగా ఉండడంతో కొత్తగా నిర్మించిన వాటిపైన పంపించేలా చేయడంతో అక్కడ జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో ఈ అనర్ధం జరిగి ఉండవచ్చు..


ఇక గడచిన కొన్ని నెలల క్రితం తిరుపతిలో కూడా తొక్కిసలాటలో భాగంగా కొంతమంది మరణించారు. ఆ వార్త మరువక ముందే ఇప్పుడు మళ్లీ ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో  భక్తులు సైతం దేవుడు దర్శనానికి వెళితే ప్రాణాలు పోయేలా ఉన్నాయంటూ.. అందుకు ఉదాహరణ మొన్న తిరుపతి తొక్కిసలాట నిన్న సింహాచలంలో తొక్కిసలాట అంటూ తెలియజేస్తున్నారు ప్రజలు. మరి ఇకనైనా అధికారులు ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: