
దీంతో ఇప్పుడు హోం మంత్రి విషయం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కాంప్లిమెంట్ ఇస్తే ఖచ్చితంగా వారందరూ సేఫ్ జోన్ లోనే ఉంటారని చర్చ ఇప్పుడు మంత్రివర్గాలలో జరుగుతున్నదట. కూటమి ప్రభుత్వంలో బిజెపి జనసేన టిడిపి మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన కూడా పలు సందర్భాలను సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు
ఇప్పటికే కొంతమంది మంత్రుల పైన కూడా విమర్శలు కూడా చేశారు పవన్ కళ్యాణ్. ఇక మరి కొంతమంది పోలీసులు కూడా వైసిపి పార్టీ ప్రభుత్వ వాసనని పోగొట్టుకోలేదని డైరెక్ట్ గా కూడా కొంతమందిని హెచ్చరించారు. దీంతో ఒక మంత్రి పైన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విమర్శలు చేశాయని విధంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా కూటమిలో భాగంగా సీఎం చంద్రబాబు కూడా మంత్రుల పనితీరులో కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ ఏ మంత్రి నైనా మెచ్చుకుంటే సేఫ్ జోన్ లో ఉంటామని అభిప్రాయానికి కొంతమంది మంత్రులు వెళ్లిపోయారట. ఇది కూటమి మంత్రులకు ఒక రాజముద్రగ మారిపోయిందనే విధంగా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు.