వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదంటూ జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అవి నిజమయ్యేలా కనిపిస్తున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలతో పాటు ప్రభుత్వం కూడా గత కొద్దిరోజులుగా పోలీసులతో విచారణ చేపడుతున్నారు.


మొదట సిఐడిఈ కేసుని డీల్ చేసింది.. అయితే ఆ తర్వాత సీట్ ని రంగంలోకి దింపి మరి అనేకమంది నాయకులను విచారణ చేపట్టారు. దీంతో కొంతమంది నేతలను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో జగన్ ప్రస్తావన వచ్చేలా ఉండేందుకు ముఖ్య కారణం అతని సన్నిహితుడుగా ఉన్న రాజ కసిరెడ్డి గత కొద్దిరోజుల క్రితమే అరెస్టు కావడం జరిగింది. ముఖ్యంగా జగన్ చుట్టూరానే ఈ కేసును తిప్పేలా చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వైసిపి హయాంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లను కూడా విచారించి మరి అరెస్టు చేయడంతో ఈ కేసు జగన్ వరకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతున్నది.



ఇక గతంలో కూడా జగన్ మీద సిబిఐ కేసులు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారని ఇలా సుమారుగా సిబిఐ 11 చార్జి సీట్లను దాఖలు చేసింది.ఈ కేసు కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు జగన్ మీద లిక్కర్ కేసు కూడా రాబోతున్నట్లు కూటమినేతలు కూడా తెలుపుతున్నారు. అయితే వైసిపి నేతలు కార్యకర్తలు మాత్రం జగన్ రాజకీయంగా పతనం చేయడానికి ఈ కేసులు అంటూ చాలామంది వైసిపి నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నిటిని చూస్తూ ఉంటే జగన్ అరెస్ట్ చేయడానికి మహానాడు సభకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగబోతుందని చర్చ జరుగుతున్నది. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: