సరిగ్గా గడిచిన రెండు సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే అలా గెలిచిన వెంటనే సీఎం సీటు కోసం చాలామంది నేతలు ప్రయత్నించారు.. అయితే చివరికి చెరో రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్య, శివకుమారులు సీఎంగా ఉండేలా ఒప్పందం చేసుకున్నారు.మరో ఆరు నెలలలో సిద్ధరామయ్య పదవి నుంచి తొలగాల్సి ఉన్నది. ఈలోగా కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఒక సర్వే అని నిర్వహించింది. ఇందులో 10 వేలకు పైగా శాంపుల్స్ తో అటు ఏప్రిల్ నుంచి మే మధ్య ఈ సర్వేను నిర్వహించిందట.


కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికి ఇప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి 51% ఓట్లు సంపాదిస్తుందని సుమారుగా 135 నుంచి 160 సీట్లతో విజయాన్ని అందుకుంటుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 40.3% మేరకు ఓట్లతో 60 నుంచి 80 స్థానాలకు పడిపోయిందని తెలియజేశారు. జెడిఎస్ అయితే చాలా ఘోరంగా 5% ఓటుతో మాత్రమే ఉందంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రెండేళ్లలోనే బిజెపి 10% పైగా ఓటు ఆదిత్యం కనిపిస్తోంది. కేవలం రెండేళ్లలోని ఈ సీను మొత్తం మారిపోయి బిజెపి బాగా పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది.. అంతేకాకుండా ఇటీవలే పాకిస్తాన్ పైన జరిగిన దాడి వల్ల కూడా బిజెపికి మైలేజ్ బాగా పెరిగిందట.


కర్ణాటకలో ప్రజలను ఆకర్షించేందుకు సూపర్ సిక్స్ హామీలంటూ కాంగ్రెస్ తీసుకువచ్చిన అవి అమలు చేయడంలో విఫలం అవ్వడంతో పాటు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నదట. దీంతో సాధ్యం కావని హామీలను ఎందుకు ఇచ్చారు అంటూ చాలామంది నేతలు ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. దీంతో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టేలా కనిపిస్తోంది.


అలా కర్ణాటకనే ఫాలో అయ్యి గత ఏడాది క్రితం ఎన్నికలలో అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలను ఇస్తామంటూ అధికారంలోకి వచ్చారు. అయితే ఇబ్బందులు పడుతూనే వాటిని అమలు చేసిన ప్రస్తుతం రైతు రుణమాఫీ పైన చాలా విమర్శలు వినిపించాయి. అలాగే మంత్రులు చేస్తున్న కొన్ని పనుల వల్ల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పాలనపరంగా కూడా పెద్దగా కాంగ్రెస్ పేరు ఎక్కడ వినిపించ లేదట.


కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీని చూసే ఏపీలో కూడా సూపర్ సిక్స్ పేరిట కూటమి ప్రభుత్వం హామీలను ఇచ్చింది. టిడిపి, జనసేన మేనిఫెస్టో కూడా ఆ సమయంలో విడుదల చేశారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సుతోపాటు, ప్రతినెల ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో పాటుగా, రైతు భరోసా ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు విడుదల చేయకపోవడం, కరెంటు చార్జీలు పెంచడం, మద్యం పాలసీ, ఇసుక మాఫియా ఇలా అన్నిటిలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందనే విధంగా వినిపిస్తున్నాయి. కేవలం వైసీపీ దాడి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో హామీలను చొప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు నానా తిప్పలు పడుతోంది. మరి కర్ణాటకలో సర్వే.. అటు తెలంగాణ ఇటు ఏపీలో ప్రభుత్వాలకు హెచ్చరికగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: