అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనలో 20042 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది.ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇప్పుడు తాజాగా రైలు ప్రమాదం జరగడం అందరిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో ఉండేటువంటి హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్లేటువంటి రైలు 64419 పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. రైలులో నాలుగవ భోగీలో రైలు ట్రాక్ తప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించి రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. ఈ ప్రమాదంతో అటువైపుగా వెళ్లే రైళ్లు రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడినట్లుగా సమాచారం. ఈ రైలు పట్టాలు తప్పడం వల్ల మరికొన్ని రైలు కూడా ఆలస్యంగా రావడమే కాకుండా మరికొన్ని రైళ్లను దారి మళ్ళించినట్లు తెలుస్తోంది. రైలు పట్టాలు పునరుద్దించేందుకు రెస్క్యూ బృందాలు ,ట్రైన్ సిబ్బంది కూడా  ప్రమాదానికి గురైన భోగిలను మళ్ళీ ట్రాక్ పైన నిలబెట్టేందుకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పెద్ద పెద్ద క్రేన్లతో పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు సాయంత్రం వరకు రిపేరు పనులను పూర్తి చేయబోతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక రాత్రి నుంచి తిరిగి మళ్ళీ రైలు పునః ప్రారంభించబోతున్నామంటు తెలియజేస్తున్నారు. అయితే ఉన్నత అధికారులకు కూడా ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి మరి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి ట్రాక్ వైఫల్యం కారణమా మెకానిక్ లోపమా లేకపోతే ఏదైనా సిగ్నల్ లోపమా అని అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే ప్రయాణికులకు ముఖ్య సమాచారాన్ని సైతం అందించేందుకు రైల్వే స్టేషన్ లో వద్ద కూడా పెద్దపెద్ద ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: