
కొంతమంది కేటుగాళ్లు మీ ఖాతాలు హోల్డ్ లో ఉందని చెప్పి అకౌంట్ కి డబ్బులు పంపితేనే అవి ఓపెన్ అవుతాయని పంపకపోతే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు మీ అకౌంట్లో జమ కాదు అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని పోలీసులు తెలియజేశారు. విజయవాడ పరిధిలో ఇద్దరు మహిళల నుంచి అలా 48,500 రూపాయలు చొప్పున తీసుకున్నారట. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో కూడా ఇద్దరు మహిళల నుంచి 29 వేల రూపాయలు కాజేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకునే లోపు మోసపోయానే విషయాన్ని గుర్తించామని ఆ బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి కంప్లైంట్ ఇచ్చారట.
దీంతో అధికారులు సైతం ఎవరు ఎలాంటి కాల్స్ చేసిన కూడా రెస్పాండ్ అవ్వద్దని కొత్తగా ఎవరు కాల్ చేసిన ఎవరూ కూడా ఓటీపీలు, బ్యాంకు నెంబర్లు ,ఆధార్ కార్డు నెంబర్లు వంటివి చెప్పవద్దంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు.. అమ్మ ఒడి పథకం డబ్బులు జమ అయిన వారందరికీ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఎవరు కూడా ఎలాంటి విషయాలను షేర్ చేయకండి అంటూ తెలుపుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా వీరినే టార్గెట్ చేస్తూ ఉన్నారని తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.