రాబోయే వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి జె పి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే అవకాశాలు కనపడుతున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి జె పి అధ్యక్ష పదవిలో పురందరేశ్వరి కొనసాగుతుంది. దానితో ఈ సారి కూడా ఈమె ఆంధ్రప్రదేశ్ బి జె పి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతుందా ..? లేక కొత్తగా వేరే ఎవరికైనా ఛాన్స్ వస్తుందా అనే ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ బి జె పి శ్రేణులతో పాటు మామూలు ప్రజల్లో కూడా నెలకొంది. ఇది ఇలా ఉంటే పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి జె పి అధ్యక్ష పదవిలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి జె పి పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది.

ఈ సారి జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బి జె పి పార్టీకి మంచి స్థానాలు కూడా దక్కాయి. అలాగే ఇప్పటికీ కూడా బి జె పి హైకేమండ్ పురందరేశ్వరిపై మంచి పాజిటివ్ థింకింగ్ తోనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బి జె పి క్యాడర్ , లీడర్లు కూడా ఈమె పై మంచి అభిప్రాయం లోనే ఉన్నారు. దానితో బి జె పి హై కమాండ్ కూడా మరో దఫా పురాంతరేశ్వరి ని ఆంధ్ర ప్రదేశ్ బి జె పి రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగించాలి అని బి జె పి హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బి జె పి అధ్యక్షరాలుగా ఉండబోయేది ఎవరు అనే దానిపై ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి గాని జరిగితే ఈ సారి పురందరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి జె పి అధ్యక్షురాలుగా కొనసాగుతుందా ..? లేక కొత్త వారు ఎవరైనా ఆ బాధ్యతలను చేపడతారా అనేది క్లియర్గా తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: