
విజిలెన్స్ నివేదికను పరిశీలించిన ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) శ్యామలరావు , శాఖాపరమైన చర్యల తో పాటు వెంటనే సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : “హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ లో పని చేసే ఉద్యోగులు సంస్థ నియమాలను పాటించడం కచ్చితంగా ఉండాలి . ఈ వ్యవహారంలో రాజశేఖర్ బాబు ప్రవర్తన టీటీడీ ఆచరణ నియమాల కు విరుద్ధమైంది . అందువల్ల ఆయన పై సస్పెన్షన్ విధించడమైందని” ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు . టీటీడీ ఉద్యోగ నిబంధనలు - ధార్మిక పరిమితుల పై మరోసారి చర్చ : ఈ సంఘటన ద్వారా టీటీడీలో పని చేసే ఉద్యోగుల వ్యక్తిగత ఆచారాల పై మరోసారి చర్చ మొదలైంది . హిందూ ధార్మిక సంస్థ లో పనిచేస్తూ, ఇతర మత ప్రార్థనల్లో పాల్గొనడం పై నిబంధనలు ఏ మేరకు కఠినంగా ఉండాలి ? అన్న ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు