
ఒక్కసారి మంత్రివర్గాన్ని ఫిక్స్ చేసిన తర్వాత మళ్లీ మార్చడం అనేది ఉండకూడదనే భావన నేతలలో కనిపిస్తోందట. గతంలో కూడా వైసిపి మంత్రివర్గం కూడా ఇలాగే జరగడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యిందనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే జగన్ తన టీమ్ పైన ఎక్కడా కూడా ఒక్క మాట కానీ హెచ్చరిక గాని చేసినట్లుగా గతంలో వార్తలు వినిపించలేదు. అయితే చంద్రబాబు హయాంలో మాత్రం గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్లీ ఇదే పద్ధతి కొనసాగుతున్నదట.
దీంతో ప్రజలలో సీఎం చంద్రబాబు ఒక్కరే పని చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందని క్షేత్రస్థాయిలో నేతల పైన అసంతృప్తి కనిపిస్తోందనే విధంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజలలో మంత్రుల విలువ చాలా తక్కువ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కూటమి నేతల మీద కూడా చాలామంది ప్రజలకు నెగిటివ్గా మారిపోయిందని అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కనిపించలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు.. వీటికి తోడు పథకాల విషయంలో కండిషన్స్, భూ సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు, ఇసుక మాఫియా, విచ్చలవిడిగా మద్యం , మహిళల పైన జరుగుతున్న విషయాలు. వంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల మీద సీఎం చంద్రబాబు ప్రత్యేకించి మరీ దృష్టి పెట్టారు.