
అయితే ఇన్ని చేసినా కూడా ఆ పేరు బిజెపికి వెళ్తుందా? అంటే వెళ్లడం లేదు.. బిజెపి కూడా వీటికి సంబంధించి ప్రచారం చేసుకోలేదు. గతంలో పురందేశ్వరి గారు ఈ ఒక్క ముక్క చెప్పారు. ఇక తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు 79,280 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమరావతికి గ్రాంట్ ఇవ్వండి అంటూ సీఎం చంద్రబాబు అడిగారట. కానీ ఇంత ఇవ్వమని చంద్రబాబు అడగలేదు గ్రాంట్ ఏదైనా ఇవ్వండి అని అడిగారట.
ఇదివరకు ఆల్రెడీ మూడున్నర వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. ప్లస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఒకవేళ ఇస్తే చంద్రబాబు గారికి పేరు.. ఇవ్వకపోతే భవిష్యత్తులో అదిగో అమరావతిని కేంద్రం మోసం చేస్తోంది అంటూ గొడవకు దిగుతారు. మరి కూటమిలో బిజెపికి ఒక పరీక్ష అని చెప్పవచ్చు. అమరావతికి మరి ఎంజరుగుతుందో చూడాలి.