నిరుద్యోగులకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్..(BSF) లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ కానిస్టేబుల్ ట్రేడ్ మెన్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన మహిళలు, పురుషులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద..3,588 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అయితే ఇందులో 3,406 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పురుషుల పోస్టులు ఉండగా, 182 మహిళా అభ్యర్థులకు కేటాయించారు. అయితే ఇవి కేవలం పదవ తరగతితోనే భర్తీ చేస్తున్నారు. వీటి గురించి పూర్తి సమాచారం చూద్దాం.



ఈ పోస్టులకు సంబంధించి ట్రేడ్ లో రెండేళ్లు పనిచేసినట్టుగా సర్టిఫికెట్ కోర్సు ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థుల వయసుకు విషయానికి వస్తే.. ఆగస్టు 24- 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంటుంది.


పురుషుల ఎత్తు కనీసం 165c.m.. జాతి 75 నుంచి 80 c.m ఉండాలి.

మహిళా అభ్యర్థుల ఎత్తు 155 c.m.

ఆగస్టు 23 -2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జనరల్ అభ్యర్థులు రూ .150 రూపాయలు.. ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థుల కు ఎలాంటి ఫీజు ఉండదు.

Pst (physical standard test)
Pet (physical efficient test)
చివరిగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఆన్లైన్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.


ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి రూ.21,700 రూపాయల నుంచి రూ.69,100 రూపాయల వరకు జీతంతో పాటు ఇతరత్రా అలవెన్స్ కూడా ఉంటాయి. ఎందుకు సంబంధించి పూర్తి విషయాలను అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.

మరి ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: